నమ్మినోళ్లనే మోసం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
*సింగరేణి కార్మిక పిల్లల గురించి ఆలోచన చేయాలే
*కారుణ్య నియామకాలు చేసిన ఘనత బీఆర్‌ఎస్ సర్కార్‌దే
*ఎర్రజెండా పార్టీలు కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీయాలే
*కార్మిక పిల్లల న్యాయమైన పోరాటానికి అండగా ఉంటాం
-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
పెద్దపల్లి,ఫిబ్రవరి 04:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
ఎన్నికల్లో గెలుపొందేందుకు అనేక మాటలు ఇస్తే ఆ మాటలు నమ్మి ఓట్లేసి గెలిపిపించినోళ్లను ఒక్క క్షణం ఆలోచించించకుండా సీఏం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మారుపేర్లతో ఉన్న సింగరేణి కార్మికుల పిల్లలు న్యాయం కోసం గోలేటి నుంచి కొత్తగూడెం వరకు చేపట్టిన పాదయాత్ర మంథనికి చేరుకోగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో వారికి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ అనాదిగా సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయని,గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను మోసం చేసి దగా చేసిందన్నారు. సంస్థలో ఎవరో క్లర్క్ చేసిన తప్పుకు సింగరేణి కార్మికుల పిల్లలు భరించడం అన్యాయమని ఆయన అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కేవసం విజిలెన్స్ డిపార్డ్‌మెంట్‌లో చిన్న సవరణలు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని, సింగరేణి కార్మికుల పిల్లల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కారుణ్య నియామకాలను తొలగిస్తే కేసీఆర్ ప్రభుత్వం పునరుద్దరించిందని,అనేక సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు.అయితే ఒకటి రెండు సమస్యలుమిగిలిపోయాయని,వాటిని కాంగ్రెస్ సర్కార్ పరిష్కరిస్తుందని నమ్మి అవకాశం ఇచ్చారని,వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత సీఏం రేవంత్‌రెడ్డిపై ఉందన్నారు.అయితే కార్మికుల పక్షాన నిలబడిపోరాటం చేయాల్సిన ఎర్రజెండా పార్టీలు ఈ విషయంపై నోరుమెదపకపోవడం బాధాకరమన్నారు.ఆకలి ఉన్నోళ్ల పక్షాన పోరాటం చేసే సీపీఐ,సింగరేణిలో గుర్తింపు పొందిన ఏఐటీయూసీలు కార్మికుల పిల్లల పక్షాన ఉండాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం నిలదీయాలని ఆయన అన్నారు.అలాగే సింగరేణి సీఎండీ సైతం ఆకలి తెలిసిన బిడ్డగా కార్మికుల పిల్లల గురించి ఆలోచన చేయాలని,వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మికుల పిల్లలు చేస్తున్న పోరాటానికి తాను అండగా ఉంటానని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
నమ్మినోళ్లనే మోసం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
Recent Comments
Hello world!
on