గంజాయి అమ్ముతున్న యువకుడు అరెస్ట్
మేడిపల్లి ఫిబ్రవరి 21 (ప్రజా కలం ప్రతినిధి)
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం శుక్రవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మోహన్ రావు పేట గ్రామానికి చెందిన బాణాల రాజు అను వ్యక్తి గత కొంతకాలంగా గంజాయి తాగడానికి అలవాటు పడి గంజాయి కొనడానికి డబ్బులు లేక అట్టి గంజాయి ద్వారానే వ్యాపారం చేస్తే అధిక మొత్తంలో లాభం పొందవచ్చు అని నిర్ణయించుకొని గత రెండు నెలల నుండి మెట్పల్లి ప్రాంతానికి చెందిన గోల్కొండ హరీష్ అతని వద్ద నుండి గంజాయిని కొనుగోలు చేసి మేడిపల్లి,మరియు భీమారం పరిసర గ్రామాలలో గంజాయి తాగే అలవాటు ఉన్న యువకులకు అమ్ముతున్నాడని అదేవిధంగా శుక్రవారం రోజున మేడిపల్లి శివారులోని ఎస్సారెస్పీ బ్రిడ్జి వద్ద ఉన్నాడని తెలుసుకొని
ఎస్సై జి శ్యామ్ రాజు సిబ్బందితోపాటు అట్టి ప్రదేశానికి వెళ్లి నిందితుని పట్టుకొని అతడి వద్ద నుండి 190 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు సుమారు ఆ గంజాయి విలువ 9500/- ఉంటుందనీ అట్టి గంజాయిని ఇద్దరు సాక్షుల సమక్షంలో సీజ్ చేశారు
మరియు అట్టి వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి అప్పజెప్పగా తదుపరి కేసు విచారణలో భాగంగా కోరుట్ల సీఐ బి సురేష్ బాబు అట్టి వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు
ఎవరైనా వ్యక్తులు గంజాయిని అక్రమంగా కలిగి ఉన్న లేదా అమ్మిన లేదా గంజాయి సేవించిన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడునని అంతేగాక యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని , భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని , పిల్లలను, వారి ప్రవర్తనను తల్లి తండ్రులు గమనిస్తూ ఉండాలని సి.ఐ బి సురేష్ బాబు గారు గారు సూచించినది.
గంజాయి అమ్ముతున్న యువకుడు అరెస్ట్
Recent Comments
Hello world!
on