వందేళ్ల సికింద్రాబాద్ స్టేషన్ భవనం కూల్చివేత .
నిజాం కళాసంస్కృతికి నిలెవత్తు నిదర్శనం
నూతన భవన నిర్మాణ పనులకు శ్రీకారం
హైదరాబాద్ ఫిబ్రవరి 14 (ప్రజాకలం):
అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నాం. కొత్తగా నిర్మాణాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు తమ మార్క్ తో పాటు ప్రజా సౌకర్యాలకు అనువుగా అనేక నిర్మాణాలు చేపట్టారు. చారిత్రాత్మక నగరాల్లో సికింద్రబాద్ ఒక్కటి, సికింద్రాబాద్ అంటేనే అందరి కళ్ల ముందు ఉండే రైల్వే స్టేషన్ ,కానీ ఇక పై ఆ భవన నమూన రూపం పూర్తిగా మారనుంది. కేంద్రం ప్రభుత్వం ఆధునీకరణ ఫనులు చేపట్టింది. అందుకోసం 720 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇప్పటికే రైల్వే స్టేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పదో నెంబర్ ప్లాట్ ఫాం వైపు సుమారు 40 శాతం పనులు పూర్తి చేశారు. కాగా రైల్వే స్టేషన్ ముందు భాగం ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం ముందు ఉన్న భవనంను తొలగించి నూత భవనాన్ని నిర్మించేందుకు పనులు శ్రీకారం చుట్టారు. దీనితో ఆ భవన నమూన ప్రయాణికలు మదిలో నిలిచిపోనుంది. నాటి కళాసంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలిందని స్థానికులు వెల్లడించారు. వందేళ్లకుపైగా చరిత్ర కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను భవనం స్థానంలో అత్యంత హంగులతో కూడి ఆధునిక భవనాన్ని నిర్మించనున్నారు.1874లో అప్పటి నిజాం పాలకుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. ఇది 1916 వరకు నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే (ఎన్‌జీఎస్ఆర్)కు ప్రధాన కేంద్రంగా ఉండేది. కానీ, స్వాతంత్య్రం అనంతరం 1951లో ఎన్జీఎస్ఆర్‌ను జాతీయం చేయడంతో భారతీయ రైల్వేలో సికింద్రాబాద్ స్టేషన్ భాగమైంది. దీంతో 1952లో ఈ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది.
వందేళ్ల సికింద్రాబాద్ స్టేషన్ భవనం కూల్చివేత
Recent Comments
Hello world!
on