పటిష్టమైన ప్రణాళికతో, ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ
ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు, సిబ్బందిఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
జగిత్యాల క్రైమ్, ఫిబ్రవరి 22 (ప్రజాకలం ప్రతినిధి) : ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో డిఎస్పి లు, సి.ఐ పోలింగ్ రోజు,పోలింగ్ ముగిసిన తరువాత భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఎలక్షన్స్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించి నిఘా ఉంచాలని అన్నారు. ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం అని పోలింగ్ ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా సాగేందుకు వారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదికారులను ఎస్పి ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలను కాపాడడం, ఎన్నికల నియమావళి పాటించబడేలా చూడడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిరోధించడం వంటి బాధ్యతలు పోలీస్ అధికారులపై ఉంటుందని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే శాసన మండలి ఎన్నికల ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందని, ఇతర శాఖలతో సమన్వయంతో చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్ కి సంబందించి 71 పోలింగ్ కేంద్రలో 36,423 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి పూర్తి అయేంత వరకు పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను పటిష్టమైన ఎస్కార్ట్ తో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించవలసి ఉంటుందని అన్నరు. జిల్లా ప్రజలు మరియు ఓటర్లు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పి కోరారు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ యొక్క సమావేశంలో అదనపు ఎస్పీ భీమ్ రావు ,డిఎస్పి లు రఘు చందర్, రాములు,SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ సి.ఐ లు రాంనరసింహారెడ్డి, వేణుగోపాల్, కృష్ణారెడ్డి, రవి, నిరంజన్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్ వేణు పాల్గొన్నారు.