పాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
-మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్
*సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం
*పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చర్యలు
*నిషేధిత ప్లాష్టిక్ పై పట్టణ వర్తక వ్యాపార సంఘాల వారితో సమావేశం
పెద్దపల్లి,ఫిబ్రవరి 06:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే దిశగా అందరూ సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అన్నారు.పర్యావరణానికి హానిచేస్తున్న ప్లాస్టిక్ వాడరాదంటూ పెద్దపల్లి పురపాలక సంఘం ఆద్వర్యంలో గురువారం పట్టణ వర్తక వ్యాపార సంఘాల వారితో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించి,జూట్ ఉత్పత్తులతో తయారు చేసిన సంచులు వాడాలని పేర్కొన్నారు. నిశేదిత ప్లాస్టిక్ తయారీ,సరఫరా,విక్రయం, వినియోగంపై నిషేధం అమల్లో ఉంటుందన్నారు.నిషేధం అమలుకు కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని చెప్పారు. దుకాణాల్లో అలాంటి ప్లాస్టిక్ కవర్లు ఇచ్చినా, వినియోగించినా జరిమానా వసూలు చేస్తామని అన్నారు.ప్లాస్టిక్ నియంత్రణకు పట్టణ వర్తక వ్యాపారస్తులు,ప్రజలందరూ సహకరించాలని కోరారు.అలాగే దుకాణ యజమానులు ప్రతిఒక్కరు ట్రేడ్ లైసెన్స్ పొంది ఉండాలని,ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి వారు,ఇప్పటి వరకు ట్రేడ్ లైసెన్స్ తీసుకొని వారు15 రోజుల్లో తీసుకోవాలన్నారు.మున్సిపల్ కార్యాలయంలో ట్రేడ్ లైసెన్స్ మేల కౌంటర్లలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ హెల్ప్ లైన్ నంబర్ 63031 27484 కు కాల్ చేయవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్లు రమాకాంత్, సురేందర్,వార్డ్ అధికారులు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి అధ్యక్షులు కమల్ కిషోర్,జనరల్ సెక్రటరీ సయ్యద్ మస్రత్, కోశాధికారి జయప్రకాష్,కిరాణం అసోసియేషన్ సభ్యులు సతీష్,దీపరామ్ తోపాటు పలువురు వర్తక వ్యాపారులు పాల్గొన్నారు.
పాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
Recent Comments
Hello world!
on