నక్సలైట్లను ఎదురించి సిద్దాంతంకోసం పనిచేసిన కాషాయవాదులు
*కార్యకర్తల త్యాగ ఫలితమే ఈనాటి బీజేపీ
*జిల్లాలో పునర్వైభవస్థితిని సాధిస్తాం
-బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి
పెద్దపల్లి,ఫిబ్రవరి 04:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
బీజేపీలో పనిచేస్తే చంపుతామని నక్సలైట్లు కొట్టిన దెబ్బలు తట్టుకొని కూడా సిద్దాంతమే ఊపిరిగా పనిచేసిన కార్యకర్తల త్యాగఫలితమే ఈనాటి అత్యున్నతస్థితికి కారణమని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కర్రె సంజీవరెడ్డి తొలిసారి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుజ్జుల మాట్లాడుతూ 30యేళ్ళుగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి,నిబద్దతతో పనిచేసి జిల్లా అధ్యక్షుడిగా సంజీవరెడ్డి బాద్యతలు చేపట్టడం గొప్ప విషయమన్నారు.జాతీయ పార్టీ బాద్యతలు మోయడం సామాన్యమైన విషయం కాదని,సమర్థవంతంగా పనిచేసి కార్యకర్తలకు,ప్రజలకు బాసటగా నిలవాల్సిన అవసరం ఉంటుందని గుజ్జుల మార్గదర్శనం చేశారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్న ఆయన,ప్రతీ కార్యకర్త ప్రజాప్రతినిధిగా గెలిచి ప్రజలకు,దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.దేశ ప్రజలంతా బీజేపీ ని కోరుకుంటున్నారని,ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్క కార్యకర్త వినియోగించుకోవాలని సూచించారు.జిల్లా అధ్యక్షుడిగా అన్నివేళలా కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ ఎదుగుదలకు పాటు పడాలని గుజ్జుల కోరారు.అనంతరం నూతన జిల్లా అద్యక్షుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాద్యతలను అప్పగించిన పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని, జిల్లాలోని పెద్దపల్లి,రామగుండం,మంథని నియోజకవర్గాల్లో కమలం జెండాను ఎగురవేసేలా ప్రణాళికలు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.ఉపాధ్యాయ, పట్టాబద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమయ్యిందని,జిల్లాలో పెద్దమొత్తంలో మెజారిటీ తీసుకువస్తామని సంజీవరెడ్డి పేర్కొన్నారు.త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి సమావేశం జరపనున్నట్లు ఆయన వివరించారు.వర్గపోరును ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని,అందరిని కలుపుకొని పార్టీని గెలుపు తీరాలని చేర్చుతానని,పార్టీ లైన్ దాటే వారిపై చర్యలు తప్పవని సంజీవరెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మేడారం మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య,రామగుండం నియోజవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి, సీనియర్ నాయకులు మేరుగు హన్మంతు గౌడ్,పల్లె సదానందం,పర్శ సమ్మయ్య,వెల్లంపల్లి శ్రీనివాసరావు,కోమల్ల వాసు,అక్కెపల్లి
క్రాంతి,బెజ్జంకి దిలీప్ కుమార్,జంగ చక్రధరరెడ్డి,ఆడెపు స్వతంత్రకుమార్,మంథని క్రిష్ణ,మౌటం నర్సింగం,
శాతరాజు రమేష్,ఎండి ఫహీం,మొలుగూరి రాజవీరు,ముస్త్యాల సంతోష్,రెడపాక క్రిష్ణ,శివం గారి సతీష్,అమరగాని ప్రదీప్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.