*యుధిష్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్..*
*రాజకీయాల్లోకి యువకులు రావాలి..*
తల్లాడ ఫిబ్రవరి 22 (ప్రజా కలం న్యూస్ ):
*తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖమ్మంజిల్లా తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు దుగ్గిదేవర యుధిష్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం యుధిష్టర్ జన్మదినం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రిని ఆయన శుక్రవారం హైదరాబాదులో కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించి సత్కరించారు. సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్యకు ప్రధాన అనుచరుడు కావటంతో ఆయన మాజీ సీఎంను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువకులు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. తాత, తండ్రి బాటలో నడుస్తూ ప్రజలకు సేవలు చేయాలని, రానున్న రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. యుధిష్టర్ తండ్రి దుగ్గిదేవర వెంకట్ లాల్ తల్లాడ మండల బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉండటంతో పాటు రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన తాత, నాయనమ్మ, తండ్రి వారసత్వాన్ని పురస్కరించుకొని యుధిష్టర్ రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.*