కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఎదురీత తప్పదా…?
*ఫోన్ లిఫ్ట్ చేయరూ…
ఫీజుల్లో రాయితీ ఇవ్వరనే ప్రతికూలతలు…?*
బీసీ వాదాన్ని తెరపైకి తెచ్చిన సంఘo నేతలు…!
జగిత్యాల ఫిబ్రవరి 25(ప్రజాకలం జిల్లా ప్రతినిధి) :
కరీంనగర్, నిజామాబాధ్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది ఉత్క0ట రేపుతున్నాయి.
కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థులతో పాటు 56 మంది అభ్యర్థులు పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచి ఎవరికీ వారుగా ప్రచారం ముమ్మరం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి గత కొంత కాలంగా విద్యా సంస్థలు నడుపుతూ ప్రస్తుతం రాజకీయాల్లో చేరి పట్టభధ్రుల ఎమ్మెల్సీగా పోటీలో నిలిచి మూడు రౌండ్లు ఉమ్మడి 4 జిల్లాలు తిరిగివచ్చి ప్రచారంలో ముందున్నారు.
అయితే కాలేజీలు, స్కూళ్లలో చదివిన సమయంలో విద్యార్థులకు ఏదైనా అవసరం ఉండి విద్యా సంస్థల అధినేతను కలవాలన్న, ఫోన్ చేసిన లిఫ్ట్ చేయరనే, అలాగే కాలేజీ,స్కూల్ ఫీజుల్లో రాయితీ ఇవ్వరనే ఆరోపణలు భాహాటంగానే వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని పేరెంట్స్,పూర్వ స్టూండెంట్స్ చెప్పడం కంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం పట్టభధ్రులను అశ్చర్యనికి గురిచేశాయాన్న టాక్ వినిపిస్తోంది.
పట్టభధ్రుల ఎమ్మెల్సీ
నియోజకవర్గం పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ, ఇతర ప్రతినిధులు కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ అభ్యర్థి మైనస్ పాయింట్ల వల్ల పట్టభధ్రుల్లో స్పందన కరువైందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నినాదం ఉపందుకుంటున్న దరిమిలా బీసీ నేత,బీఎస్పీ అభ్యర్థి గెలుపుకు ఆ సంఘం నేతలు సమావేశాలు ఏర్పాటు చేయడమే గాకుండా పట్టభధ్రులను కలస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
దీంతో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి మూడు చోట్ల ప్రచారo చేయడం చూస్తుంటే అభ్యర్థికి ఎదురిత తప్పదన్న అభిప్రాయాలూ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
పోలింగుకు ఇంకా మూడు రోజులు మిగిలి ఉండగా పరిస్థితులు ఏమైనా కాంగ్రెస్ అభ్యర్తికి అనుకూలమైతే తప్పా గెలుపుపై ఆశలు సన్నగిల్లినట్లేనన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.