Saturday, April 5, 2025
HomeUncategorizedఎమ్మెల్సీ ఎన్నికలు సక్రమంగా జరగట్లేదు

ఎమ్మెల్సీ ఎన్నికలు సక్రమంగా జరగట్లేదు

ఎమ్మెల్సీ ఎన్నికలు సక్రమంగా జరగట్లేదు!
– సర్ధార్ రవీందర్ సింగ్
కరీంనగర్ ఫిబ్రవరి 14 (ప్రజాకలం):
కరీంనగర్ జిల్లా తారక్ హోటల్ లో నేడు మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ , కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ గారు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ….

– కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు .
– స్క్రూటినీ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు వుట్కూరి నరేందర్ రెడ్డి గా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి .. తర్వాత అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గా పేరును మార్చేయడం ఏమిటని ప్రశ్నించారు…
– కేవలం తన పేరు సీరియల్ నెంబర్ లో ముందు వరుసలో రావాలని కుట్రలు చేసి నరేందర్ రెడ్డి గారు పేరును అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గా మార్పులు చేశారని అన్నారు.
– అల్ఫోర్స్ అనేది ఒక సైంటిస్ట్ కి సంబంధించిన పేరు అని … ఎన్నికల క్రమ సంఖ్యలో ఎలా పరిగణించారాని ప్రశ్నించారు.
– స్క్రిటీని జరిపిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు నరేందర్ రెడ్డి గారి పేరును ఎలా మార్చాలని సర్దార్ రవీందర్ సింగ్ గారు ప్రశ్నించారు.
– మేము ముందు నుండే మీడియా సాక్షిగా చెప్తూనే ఉన్నాం మాపై కుట్రలు చేస్తున్నారని .. నా పేరు క్రమసంఖ్యలో కిందికి తీసుకువెళ్లని ఉద్దేశంతోనే చేస్తున్నారని ధ్వజమెత్తారు.
– అన్ని పార్టీలతో కలిపి మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల బీఫామ్ లు పది మాత్రమే వచ్చియి , కానీ రాత్రికి రాత్రి 11వ బి ఫామ్ శ్రీకాంత్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇచ్చారు.
– ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసిన అభ్యర్థికి బి ఫాం ఎలా వచ్చిందో చెప్పాలని అన్నారు .
– నామినేషన్ సమయంలో కూడా మా వాహనాలను అడ్డగించి … మంత్రుల వాహనాలను లోపలికి అనుమతించడం ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన ఇంతవరకు పట్టించుకోలేదని అన్నారు.
– సెక్షన్ 15 ప్రకారం పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు మార్చుకోవాలనుకుంటే ఫామ్ నంబర్ 4 సమర్పించక ముందే మార్చుకోవాలి.
– ఈ విషయంపై అధికారులను ప్రశ్నిస్తే క్లారిఫికేషన్ తప్పులని చెప్తున్నారని అన్నారు.
– గాంధి భవన్ ఎన్నికల లేక భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎన్నికల అంటూ మండిపడ్డారు
– నేడు రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్ కు దరఖాస్తులు సమర్పించిన సర్దార్ రవీందర్ సింగ్ గారు..
– దీనిపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో న్యాయవాది తేజ్ దీప్ రెడ్డి కోమటిరెడ్డి గారు , పెండ్యాల మహేష్ గారు, కెంసరం తిరుపతి గారు , రామ్ యాదవ్ గారు , కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments