*nSure హెల్తీ స్పైన్ ఆధ్వర్యంలో డేటా-ఆధారిత మస్క్యులోస్కెలెటల్ (MSK) హెల్త్ టెక్నాలజీ సేవలు*..
– *నార్డిక్ హెల్త్ (ఫిన్‌లాండ్)* తో ప్రత్యేక భాగస్వామ్యం..
– భారత్‌లో *ప్రివెంటివ్ స్పైన్, స్పోర్ట్స్ హెల్త్‌కేర్‌లో విప్లవాత్మక మార్పు* లకు బీజం..
*హైదరాబాద్, ఇండియా – ఫిబ్రవరి 04, (ప్రజాకలం ప్రతినిధి)
భారత్‌లో ప్రివెంటివ్ స్పైన్, స్పోర్ట్స్ హెల్త్‌కేర్‌లో విప్లవాత్మకంగా మార్చడంలో భాగంగా nSure హెల్తీ స్పైన్ ఆధ్వర్యంలో డేటా-ఆధారిత మస్క్యులోస్కెలెటల్ (MSK) హెల్త్ టెక్నాలజీని తమ సేవలతో అనుసంధానం చేయనుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతిష్టాత్మక నార్డిక్ హెల్త్ ఫిన్‌లాండ్‌తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని ఎమ్‌ఎస్‌కే హెల్త్ టెక్నాలజీ వేదికను స్వీకరించినట్లు nSure హెల్తీ స్పైన్ గర్వంగా ప్రకటించింది. వెన్నెముక, భుజం, తుంటి, మోకాలి ఆరోగ్యం కోసం అత్యాధునిక బయోమెకానికల్ ఆప్టిమైజ్ వ్యాయామ చికిత్స పరికరాలు హైదరాబాద్‌లోని కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ (CSSH)లో అందుబాటులో ఉంటాయి. ఇది సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాబోయే మొట్టమొదటి స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ సెంటర్ కావడం విశేషం.
భారతదేశంలో మొదటిసారిగా అత్యాధునిక వెన్నెముక, స్పోర్ట్స్ హెల్త్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టడానికి వ్యూహాత్మక సహకారంలో భాగంగా… nSure హెల్తీ స్పైన్ ఇటీవల ఫిన్లాండ్‌లోని నార్డిక్ హెల్త్ నుండి టెక్నాలజీ ఇన్వెంటర్లు ‘‘ఆర్నో పార్వియైనెన్, సిర్కా పార్వియైనెన్’’లను హైదరాబాద్‌కు ఆహ్వానించి CSSHలో ఆతిథ్యం ఇచ్చింది.
వినూత్న ఆరోగ్య సాంకేతిక వ్యవస్థలతో పాటు అత్యుత్తమ ఆరోగ్య సేవలందించడంలో ఫిన్లాండ్ ప్రధానంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నార్డిక్ హెల్త్ ఆధ్వర్యంలోని నైపుణ్యాలను హైదరాబాద్‌లోని CSSHలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి, ప్రపంచ స్థాయి సంరక్షణను అందించడానికి ఈ బృందానికి శిక్షణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది. ఈ పర్యటన సందర్భంగా ఆర్నో, సిర్కా పర్యవేక్షణలో nSure హెల్తీ స్పైన్ బృందం కోసం సమగ్ర శిక్షణ, విద్యా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా nSure హెల్తీ స్పైన్ సీఈఓ నరేష్ కుమార్ పగిడిమర్రీ మాట్లాడుతూ., “ఆర్నో, సిర్కా మార్గదర్శకత్వంతో తమ క్లయింట్‌లకు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించే ప్రపంచ స్థాయి విజ్ఞానం, నైపుణ్యంతో మా బృందం సన్నద్ధమైంది. నార్డిక్ హెల్త్ సంస్థ నిపుణుల సందర్శన.. వైద్య సాంకేతికతలో తాజా పురోగతులను, వినూత్న ఆవిష్కరణలను ఏకీకృతం చేయడంలో nSure హెల్తీ స్పైన్ యొక్క అంకితభావాన్ని బలోపేతం చేస్తుంది. ఈ చొరవ అత్యాధునిక వెన్నెముక, క్రీడా ఆరోగ్య సంరక్షణకు కేంద్రంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత పెంచడానికి సిద్ధంగా ఉంది. అథ్లెట్లు, క్రీడా నిపుణులు వారి జీవన నాణ్యతను మెరుగుపరచాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఈ సేవలు ప్రయోజనం చేకూరుస్తాయని’’ తెలిపారు.