- మహాశివరాత్రి ని పురస్కరించుకొని జిల్లా లోని ఆలయాలలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు
జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.
పెంబట్ల (దుబ్బ రాజన్న స్వామి), మల్లాపూర్ (కనక సోమేశ్వర స్వామి) ఆలయాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
జగిత్యాల క్రైమ్, ఫిబ్రవరి 25 (ప్రజాకలం ప్రతినిధి) : సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని పెంబట్ల కోనాపూర్ గ్రామంలో గల పుణ్యక్షేత్రం దుబ్బ రాజన్న స్వామి, మల్లాపూర్ మండల కేంద్ర సంఘటన గల కనక సోమేశ్వర స్వామి జాతరల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు జిల్లా ఎస్పీ అధికారులను. మహాశివరాత్రి సందర్భంగా జరుగు జాతర కు ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో, క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులు వారి పోలీసుల సలహాలు సూచనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. జిల్లా ఎస్పీ వెంట రూరల్ సీఐ కృష్ణ రెడ్డి, సారంగాపూర్ ఎస్సై దత్తాద్రి, మల్లాపూర్ ఎస్.ఐ రాజు, ఉన్నారు.