అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
పొన్నం ప్రభాకర్
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి18(ప్రజా కలం )
హయత్ నగర్ మునగనూర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ బీసీ సంక్షేమ పాఠశాలలో, ఇన్స్పైర్ & ఇగ్నైట్ సంస్థ నిర్వహించిన మోటివేషనల్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షులు రుద్ర రాజు, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్ , మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ఐ ఎఫ్ ఎస్ అధికారి సైదులు హాజరయ్యారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
తెలంగాణ ప్రభుత్వం విద్యలో సమాన అవకాశాలను అందించడానికి బీసీ సంక్షేమ పాఠశాలలను బలంగా అభివృద్ధి చేస్తోందని ఈ పాఠశాలల ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉచిత వసతి, భోజన సౌకర్యాలు, అదనపు శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నారని తెలిపారు . విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి అని సూచించారు. ముఖ్యమంత్రి, తను ఇంకా చాలా మంది మా నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన వాళ్లమే అన్నారు. ప్రభుత్వ, సంక్షేమ పాఠశాలల అభివృద్ధి కోసం మేం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. వీటిని మరింత అభివృద్ధి చేసి, ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మోటివేషనల్ శిక్షణ తరగతులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ…
గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా సదుపాయాలు, ఉచిత వసతి, భోజనం, ప్రతిభను మెరుగుపరిచే శిక్షణలు అందడం గొప్ప విషయం. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి అని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపర్చేందుకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ రూ. 375 కోట్లు కేటాయించిందని తెలిపారు. యువతలో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని, అటు విద్యలోనూ, ఇటు క్రీడలలోనూ యువతను చురుగ్గా ఉంచుతూ వారిని చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బీసీ సంక్షేమ విద్యాసంస్థలు మెరుగుపడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులు కష్టపడితే, ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా దేశవ్యాప్తంగా ప్రతిభావంతులుగా ఎదగవచ్చు అని సూచించారు.శిక్షణా తరగతుల ద్వారా తమలో కొత్త ఆత్మవిశ్వాసం, స్పష్టమైన లక్ష్యాలు, భవిష్యత్తుపై ఆత్మబలం పెరిగిందని విద్యార్థినులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని, ఉన్నతమైన చదువులు పూర్తిచేసి, మంచి ఉద్యోగాలు సాధిస్తామని విద్యార్థినులు ధీమా వ్యక్తం చేశారు.పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమైనవి. విద్యార్ధులు కృషి చేస్తే, బీసీ సంక్షేమ పాఠశాలల నుంచే దేశానికి గొప్ప నేతలు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు తయారవుతారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు , ప్రజా ప్రతినిధులు , అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
Recent Comments
Hello world!
on