ప్రజా కలం ఎఫెక్ట్..
వాల్గొండ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన డీఈవో..
మల్లాపూర్ ఫిబ్రవరి 7 ( ప్రజా కలం ప్రతినిధి)
ప్రజా కలం దినపత్రికలో వెలువడిన ”బడిలో నీటి కష్టాలు’ అనే కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశాల మేరకు డీఈవో
కే. రాము వాల్గొండ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. గత పది రోజుల నుండి నీళ్లు లేక విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ సెక్రెటరీ తో మాట్లాడి పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.గత పది రోజుల నుండి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని
ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కు పాఠశాల లో నెలకొన్న పరిస్థితుల పై రిపోర్టు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. డీఈవో తో పాటు మండల విద్యాధికారి దామోదర్ రెడ్డి, వెంకట్ రెడ్డి మనోజ్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
ప్రజా కలం ఎఫెక్ట్..
Recent Comments
Hello world!
on