‘ప్రజాకలం’ కథనానికి స్పందన
– మురుగు కాలువలో చెత్తను తొలగించిన మున్సిపల్ అధికారులు
– ‘ప్రజాకలం’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపిన వార్డు ప్రజలు
మెట్ పల్లి ప్రతినిధి, (ప్రజాకలం) : ‘ప్రజాకలం’ తెలుగు జాతీయ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈనెల 5న మెట్ పల్లి పట్టణంలోని ఏడో వార్డులో గల ఓ కాలనీలో అప్పడు సుమారు గత 20 రోజులుగా చెత్త చెదారం కారణంగా మురుగునీరు నిలిచిపోగా ఈ విషయాన్ని కాలనీ ప్రజలు ‘ప్రజాకలం’ దినపత్రిక దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 5న ‘ప్రజాకలం’ తెలుగు జాతీయ దినపత్రికలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది. ప్రచురించిన కథనాన్ని పరిశీలించిన అధికారులు బుధవారం మున్సిపల్ సిబ్బందితో మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించే పనులను చేపట్టారు. మురికి కాలువపై అక్రమంగా ఏర్పాటు చేసిన కట్టడాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేసి కాలువలో పెరుకుపోయిన చిత్తచెదారాన్ని తొలగించారు. సమస్య పరిష్కారానికి తనవంతు కృషిచేసిన ‘ప్రజాకలం’ తెలుగు జాతీయ దినపత్రికకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.