ప్రజాకలం ఎఫెక్ట్
సిసి రోడ్డు మీద ఉన్న మట్టి తొలగింపు
*రుద్రంగి, పిబ్రవరి 19, (ప్రజాకలం ప్రతినిధి)*
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ కృషితో పలు వీధులకు సిసి రోడ్లు మంజూరు కాగా వాటిని నెల క్రితం నిర్మాణం పూర్తి చేసారు. అయితే నేవూరి పల్లెకు వెళ్ళే దారిలో వేసిన సిసి రోడ్డు పై క్యూరింగ్ చేయడం కోసం వేసిన మట్టి కట్టలు నెల రోజుల దాటిన మట్టిని తొలగించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై ‘ సిసి రోడ్డు వేసారు.. మట్టి కట్టలు తొలగించడం మరిచారు ‘ అనే కథనం మంగళవారం ప్రజాకలం దినత్రికలో ప్రచురించగా స్పందించిన కాంట్రాక్టర్ సిసి పై ఉన్న మట్టి కట్టలను తొలగించి శుభ్రం చేసారు. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాకలం ఎఫెక్ట్
Recent Comments
Hello world!
on