*ఆర్టీఏ సభ్యుడు సురేష్ కు మంథని ప్రెస్ క్లబ్ సన్మానం*
పెద్దపల్లి,పిబ్రవరి 21:(ప్రజాకలం ప్రతినిధి)పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ నాన్-అఫీషియల్ సభ్యుడిగా నియమితులైన మంథని సురేష్‌ను మంథని ప్రెస్ క్లబ్ సన్మానించింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ తన నియామకానికి మంత్రి శ్రీధర్ బాబు సహకరించారని,అందరి సహకారంతో బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు.ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని,ఆర్టీఏ కార్యాలయానికి భూమి సేకరణ,భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ సురేష్ 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థంగా పనిచేయడం వల్లే ఈ పదవి లభించిందని, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి జిల్లా స్థాయిలో పదవి చేపట్టడం గర్వకారణమని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.