కబ్జాదారుల నుండి నా భూమిని కాపాడండి
-ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు
పెద్దపల్లి :(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
తమకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్న వారినుండి తమ భూమిని రక్షించాలని కోరుతూ ముత్తె సంపత్ కుమార్ సొమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సోమవారం విలేకరులతో సంపత్ మాట్లాడుతూ రామగిరి మండలం బేగంపేట శివారులోని సర్వే నం.32లో తమకు 6ఎకరాల 28గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు పేర్కొన్న సంపత్,తమ పక్క పొలానికి చెందిన యజమానులు గొర్ల రాజయ్య,గొర్ల కొమురయ్య,ఎర్ర కనుకమ్మ, కానుగంటి మొగిళి 32గుంటల వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నరని ఆరోపించారు.నకిలీ పాసుపుస్తకాలను సృష్టించి, ధన, రాజకీయ బలంతో కొంతమంది అధికారుల అండతో తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ప్రజావాణిలో చేసిన ఫిర్యాదులో సంపత్ పేర్కొన్నారు.
prajakalamhttp://prajakalam.com/wp-content/uploads/2025/02/Prajakalam-EP-15th-copy-2.png