ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం ఖాయం
– బీజేపీ సీనియర్ నేత డాక్టర్ చిట్నేని రఘు
– మెట్ పల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్న డాక్టర్ రఘు
మెట్ పల్లి : ప్రతినిధి ఫిబ్రవరి 27 (ప్రజా కలం) 2025 పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ విజయం సాధించడం ఖాయమని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ చిట్నేని రఘు అన్నారు. గురువారం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పోలింగ్ లో మెట్ పల్లి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి కొమురయ్య పోటీలో ఉన్నారని తెలిపారు. వారిద్దరి గెలుపు కోసం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టభద్రుల ఓటర్ల ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి స్థానిక భారతీయ జనతా పార్టీ అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు వివరించారని. తమ పార్టీకి పట్టభద్రుల ఓటర్ల నుంచి మంచి స్పందన లభించిందని గుర్తు చేశారు. విద్యావంతులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేశారని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న పాలనను గమనిస్తున్న యువత బీజేపీ వైపే మొగ్గు చూపుతోంది. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కానుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది వస్తుందని, డబుల్ ఇంజన్ సర్కారును తాము ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. కాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు తమ పార్టీ కైవసం చేసుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లందరూ తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు ఇటు పోలీసులు అధికారులకు, అటు పోలింగ్ అధికారులకు, పట్టపధ్రులకు భారతీయ జనతా పార్టీ అన్నారు కృతజ్ఞతలు తెలుపుతున్నామని. ఆయన వెంట కోరుట్ల నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రఘన్న యువసేన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.