ప్రజా కలం వార్త కథనానికి స్పందన…
– ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద గల ఫ్లెక్సీ ల తొలగింపు
ఫోటో : తొలగించిన ఫ్లెక్స్.
ఎల్లారెడ్డి ఫిబ్రవరి 14 ప్రజా కలం ప్రతినిధి : ప్రజా కలం దినపత్రిక లో గురువారం ప్రచురితమైన ఈ ఫ్లెక్సీ కి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వర్తించదా ? అనే కథనానికి అధికారులు స్పందించి శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలు తొలగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ స్థానిక మున్సిపల్ అధికారులు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఉన్న ఫ్లెక్సీని తొలగించకపోవడం పట్ల ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తం చేశాయి. అధికార పక్షానికి ఒక న్యాయం ప్రతిపక్షాలకు మరో న్యాయమా అంటూ వారు మున్సిపల్ అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాకలం వార్త కథనానికి స్పందించి సదరు ఫ్లెక్సీని తొలగించారు.