*అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులు సీజ్.*
*వలిగొండ ఫిబ్రవరి 15 ప్రజా కలం*:మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గోకారం గ్రామ పరిధిలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా నిల్వ చేసి ఇతరుల అవసరాలకు ఎక్కువ ధరలకు విక్రయించి అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇసుక డంపులను సీజ్ చేశారు.శుక్రవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో మల్లేపల్లి గ్రామానికి చెందిన రేగు సైదులుకు చెందిన 50 టన్నుల ఇసుక,మల్లేపల్లి గ్రామానికి చెందిన మల్ల బాలరాజుకు చెందిన 45 టన్నుల ఇసుక డంపు.వెల్వర్తి గ్రామానికి చెందిన ఎడవెల్లి గణేష్ కు చెందిన 40 టన్నుల అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్పులను పోలీసులు దాడులు చేసి సీజ్ చేశారు. మండలంలోని గోకారం గ్రామంలో మూసీ నది నుండి ఇసుక ట్రాక్టర్ల ద్వారా తరలించి అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్పులపై గోకారం గ్రామానికి చెందిన మందుల నర్సింహకు చెందిన 30 టన్నుల ఇసుక, దేశపాక భాస్కర్ అక్రమంగా నిల్వ చేసిన 40 టన్నుల ఇసుక డంప్పులపై విశ్వనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి సీజ్ చేసి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.