సింగరేణి సంస్థకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి..
– సింగరేణి సెక్టర్-1 పాఠశాలలో సీబీఎస్ఈ అప్ గ్రేడ్ చేయాలి..
– ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు 80శాతం ఉద్యోగ అవకాశలు కల్పించాలి
– కాలయాపన చేయకుండా కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
– హిందూ శ్మశానవాటికలో ఉచిత దహనసంస్కారలు నిర్వహించాలి
– సింగరేణి సీఎండీని కోరిన మద్దెల దినేష్
గోదావరిఖని, (ప్రజా కలం ప్రతినిధి)
రామగుండం రీజియన్ లో పర్యటిస్తున్న సింగరేణి సీ అండ్ ఎండీ బలరాంను గురువారం స్థానిక ఓసీపీ-3 కృషి భవన్ లో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, ఉపాధ్యక్షులు రేణికుంట్ల నరేంద్ర కలిసి గొదావరిఖనిలోని పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని బాలరాంకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మద్దెల దినేష్, రేణికుంట్ల నరేంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి గుండె కాయలాంటిది అతి పెద్ద సింగరేణి సంస్థ, అందులో భాగంగా ఆర్టీ-1 కూడా పెద్ద డివిజన్ ఇండస్ట్రీయల్ ఏరియా అయినప్పటికీ నిరుద్యోగం మాత్రం గోదావరిఖనిలో విలయతాండవం చేస్తుందని, సింగరేణి సంస్థ ద్వారా ఆర్జీ-1 ఏరియా లో సింగరేణి సంస్థకు అనుబంధంగా అనుబంధం పరిశ్రమలు ఏర్పాటు చేసి మాజీ కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల, భూనిర్వాసిత పిల్లలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని కొరమన్నారు. అదే విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా సింగరేణిలో సింగరేణి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సింగరేణి పాఠశాలలను అప్ గ్రేడ్ చేయాల్సిందని. 5-1 పాఠశాలను సీబీఎస్ఈ పాఠశాలగా మార్చాల్సిన గోదావరిఖని సింగరేణి సెక్టర్-1 అవసరం ఉందన్నారు. అదే విధంగా ఓపెన్ కాస్ట్-3,5 భారీ బ్లాస్టింగ్ల తో రోజు మధ్యాహ్నం 03:30 గంటల నుండి 04:00 గంటల వరకు భూకంపాన్ని తలపించే విధంగా బ్లాస్టింగ్లు జరుగుతున్న సందర్భంగా దుమ్ముధూళితో రోగాలభారిన పడుతున్నామని పేర్కొన్నారు. పొమ్మనలేక పొగ పోడుతున్నారని అందులో భాగంగా 33వ డివిజన్ ఓసిపి-5 ప్రభావిత డివిజన్ అయినప్పటికి 33వ డివిజన్ ను సింగరేణి యాజమాన్యమే దత్తత తీసుకుని డివిజన్ లో రోడ్లు, పార్కులు, మంచినీటి సౌకర్యం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ఓపెన్ జీమ్, బోరింగ్లు, సోలార్ లైట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆర్వో వాటర్ ప్లాంట్ల మంజురు చేసి అభివృద్ధి చేయాలని కార్మికుల కుటుంబాల పక్షాన కోరడం జరిగిందన్నారు. సింగరేణి కార్మికులు, మాజీ కార్మికుల పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ కొలువుల కోసం పోటీ పడుతున్న తరుణంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి శిక్షణ కేంద్రాలలో ఆర్థికంగా నష్టపోతున్నారని, సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖనిలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేసి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపయోగ పడేవిధంగా చూడాలని వారికి సూచించమన్నారు. అలాగే గోదావరిఖనిలోని హిందూ స్మశాన వాటికను సింగరేణి దత్తత తీసుకోని స్మశానంలో కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ఎవరైనా దురుదృష్టవశాత్తు
మరణిస్తే సింగరేణి ద్వారనె ఉచిత దహన సంస్కారాలు నిర్వహించాలని కొరమన్నారు. ముఖ్యంగ సింగరేణిలో గత కొనేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు పార్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న వారికి హైపవర్ వేతనాలు అమలు చేయాలని వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. పై విషయాలను అన్నిటిపై సానుకూలంగా స్పందించి ప్రతి సమస్యను ఒకొక్కటిగా పరిష్కరిస్తామని ముందుగా సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేద్దాం అని హామీ ఇచ్చారాని దినేష్ తెలిపారు.
సింగరేణి సంస్థకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి..
Recent Comments
Hello world!
on