క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి..
కోలాహాలంగా జిల్లా స్థాయి ఆటల పోటీలు
చెరుకుపల్లి,ఫిబ్రవరి 6 (ప్రజా కలం ప్రతినిధి)
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని రేపల్లె నియోజక వర్గ పి ఓ సి మత్తి భాస్కరరావు అన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి జెడ్పి హైస్కూల్ నందు గత రెండు రోజులుగా భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖా నెహ్రూ యువ కేంద్ర గుంటూరు మరియు మత్తి శివ శంకరరావు ట్రస్ట్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 05వ తేదీ బుధవారం స్థానిక చెరుకుపల్లి జెడ్పి హైస్కూల్లో యువతకు జిల్లా స్థాయి క్రీడల పోటీలు వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్ 100 మీటర్లు, షాట్ ఫుట్ ఈవెంట్లలో జరిగాయి. ఈ పోటీలను చెరుకుపల్లి ఎం ఈ టి నవీన్ కుమార్ ఎం ఈ ఓ. ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర రావు మాట్లాడుతూ యువతకు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమని పేర్కొన్నారు అనేక మంది యువత కేవలం చదువు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని విద్యతోపాటు క్రీడలకు కూడా రాణించినట్లయితే శారీరికంగా మానసికంగా ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి కలుగుతుందన్నారు. ఎం ఈ ఓ టి నవీన్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సాధారణమని, ఓటమి-గెలుపుకు నాంది అని తెలిపారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నెహ్రూ యువ కేంద్ర ఆయన అభినందించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుండి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.వాలీబాల్, కబాడీ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ప్రధమ ద్వితీయ స్థానాలలో వరుసగా వాలీ బాల్ అంశం లో రాంబొట్ల వారి పాలెం, కర్లపాలెం,కబడ్డీ లో గుళ్లపల్లి టీం,బాపట్ల టీం నిలిచారు.విజేతలకు షీల్డ్స్, ప్రశంసా పత్రాలు మెడల్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమములో చెరుకుపల్లి జెడ్పి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కె లక్ష్మి నారాయణ,కె వెంకట్రావు, పిడి డి ప్రమీల,పోస్టల్ పీఈ కె నరేంద్ర గోపి, పీఈటీలు కృష్ణమూర్తి, వై పద్మావతి, వై రవి కిరణ్, ఎస్ హనుమంత రావు, మత్తి యానాది రావు, కె జగన్మోహన రావు,పి పృథ్వి కుమార్, జి శ్రీనివాసరావు, ఎం చక్రవర్తి జిల్లాలోని పలు ప్రాంతాలనుండి యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ క్రీడా పోటీలు చూసేందుకు చుట్టుపక్కల ఇతర ప్రాంతాలుంచి పెద్ద ఎత్తున యువకులు తరలి వచ్చారు
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి..
Recent Comments
Hello world!
on