జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-TUWJ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డైరీ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు
మేడ్చల్ మల్కాజిగిరి ఫిబ్రవరి 04 ప్రజాకలం ప్రతినిధి
రాష్ట్రంలో జర్నలిస్టుల ఆయా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వీలైనంత తొందరలో చర్యలు చేపడతామని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖల మంత్రి, మేడ్చల్ జిల్లా ఇంచార్జి మంత్రి
డి.శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శాఖ రూపొందించిన 2025 మీడియా డైరీని మంగళవారం నాడు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్ది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా TUWJ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకటరామిరెడ్డిలతో కలిసి, ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వాటర్స్ లో మంత్రి ఆవిష్కరించారు.
సమగ్ర సమాచారంతో టీయూడబ్ల్యూజే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శాఖ రూపొంచిన డైరీ జర్నలిస్టులకే కాకుండా, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శ్రీధర్ బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ టి మల్కయ్య, జిల్లా కమిటీ నాయకులు గోవిందు, మాణిక్య రెడ్డి , చంద్రమోహన్, రాములు, అక్బర్ భాష , శ్రీనివాస్ గౌడ్ నాగేందర్ చారి, శ్రీధర్ రావు, అనుబంధ కమిటీ కన్వీనర్లు చంద్రమౌళి, విజయ్ , దామోదర్ రెడ్డి, నియోజకవర్గ, ప్రెస్ క్లబ్ ల అధ్యక్ష, కార్యదర్శులు వల్ల మహేందర్ రెడ్డి, వేముల శంకర్, శేషారెడ్డి, నాయకులు బాల్ రెడ్డి, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించండి
దాదాపు 15ఏళ్ళ క్రితం ఉప్పల్, ఘట్ కేసర్ జర్నలిస్టులకు కాట సింగారం గ్రామ శివారులో కేటాయించిన ఇళ్ల స్థలాల భూమిని వెంటనే స్వాధీనం చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ, యూనియన్ రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాల్ రాజ్ గౌడ్, జిల్లా కార్యదర్శి వెంకట్రాం రెడ్డి లతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రాన్ని అందించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.