వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటి ఎన్నిక
– గౌరవ అధ్యక్షులుగా రమేష్,అధ్యక్షునిగా పెద్దిటి దామోదర్ రెడ్డి,
వలిగొండ ఫిబ్రవరి 15 ప్రజాకలం:వలిగొండ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పెద్దిటి దామోదర్ రెడ్డి( నమస్తే తెలంగాణ)ని ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన వలిగొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశంలో గౌరవ అధ్యక్షునిగా శివనాధుల రమేష్(సాక్షి),ఉపాధ్యక్షులుగా ఎమ్మె బాలరాజు(వార్త), గన్నెబోయిన నరసింహ (ప్రజాదర్బార్),ప్రధాన కార్యదర్శిగా డోగిపర్తి సంతోష్ (సూర్య వెలుగు),కోశాధికారిగా రాపోలు పవన్ కుమార్ (వాస్తవం),సహాయ కార్యదర్శిగా కట్ట శ్రీనివాసరావు (దిశ),సలహాదారులుగా గోద అచ్చయ్య,(నేటివాస్తవాలు) ఆలకుంట్ల కృష్ణ (వార్త వేదిక),లను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన పెద్దిటి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని,తనను ఎంతో నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకున్న జర్నలిస్టు మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు కదిరేణి సురేష్,(ప్రజాకలం) దేశిరెడ్డి వెంకట్ రెడ్డి (నవ తెలంగాణ రూరల్),ఎల్లంకి రాజు,(పిడిఆర్ న్యూస్),ఎర్ర శ్రీకాంత్,(విజయక్రాంతి),పల్లెర్ల సుధాకర్,(పోలీస్ నిఘా) సుక్క గణేష్ (ప్రజాజ్యోతి),వడ్డేమాన్ సురేష్ (న్యూస్ ఇండియా),తదితరులు పాల్గొన్నారు.