Sunday, April 6, 2025
HomeHeadlinesతెలంగాణకు నెత్తి మీద నీటి కుండ పెద్దపల్లి

తెలంగాణకు నెత్తి మీద నీటి కుండ పెద్దపల్లి

తెలంగాణకు నెత్తి మీద నీటి కుండ పెద్దపల్లి

*బీసీ కులగణన అంతా తప్పుల తడకే

*కాంగ్రెస్‌కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు

*వివక్షతతో కూడిన పాలన సాగిస్తున్న కాంగ్రెస్

*ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం

-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపల్లి,ఫిబ్రవరి 03:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
తెలంగాణకు నెత్తి మీద నీటి కుండ లాంటిది పెద్దపల్లి జిల్లా అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.సోమవారం జిల్లాలో పర్యటించిన ఆమెకు జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.అనంతరం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అద్యక్షుడు కోరుకంటి చందర్ ఆద్యక్షతన నిర్వహించి సమావేశంలో పార్టీ కార్యకర్తలు,టీబీజీకేఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గోని మాట్లాడారు.బీఆర్ఎస్ చేసిన ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, కానీ బీసీ గణన సరిగా జరగలేదని ఆరోపించారు.కాంగ్రెస్ చేపట్టిన కులగణన అంతా తప్పుడు తడకలా ఉందని విమర్షించారు.బీసీ జనాభాపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెబుతోంది.అసలు కాంగ్రెస్‌కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు.తెలంగాణ ఏర్పాటు తరువాతనే పెద్దపల్లి జిల్లాగా ఏర్పడిందని,బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతనే రామగుండానికి సింగరేణి మెడికల్ కళాశాల వచ్చిందని గుర్తు చేశారు.పెద్దపల్లి జిల్లా ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 8,బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం గుండుసున్నానే ఇచ్చిందని విమర్శించారు.బీఆర్ఎస్ హయంలో సింగరేణిలో 13 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు.సింగరేణిలో డిపెండెంట్ అలియాస్ సమస్య పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు.అలియాస్ సమస్యపై ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు అలియాస్ సమస్య కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కాగితాలను మార్చుతుంటే, బీఆర్ఎస్ హయాంలో తాము కార్మికుల జీవితాలు మార్చామని అన్నారు.సింగరేణి నిధులు డీఎంఎఫ్టీ పేరుతో కొడంగల్‌కు తరలించుకుపోతున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షతతో కూడిన పాలన సాగిస్తుందని మండిపడ్డారు.సింగరేణిలో 13 శాతం ఉన్న బోనస్‌ను బీఆర్ఎస్ 32 శాతానికి పెంచిందని వెల్లడించారు.సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.రాత్రికల్లా రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పిన రేవంత్ ఏ గ్రామంలో ఒక్క మూలకు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.సింగరేణి కార్మికులను,విద్యార్థులను,మహిళలను,రైతులను అందరినీ కాంగ్రెస్ మోసం చేస్తోందని అన్నారు.మళ్ళీ మళ్ళీ సర్వేలు అంటూ జనాన్ని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.రాష్ట్రంలో ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.2001 నుండి నేటి వరకు టీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న బీఆర్ఎస్ పట్టణ అద్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ పార్టీకి చేస్తున్న సేవలను ఎమ్మెల్సీ కవిత కోనియాడారు.రాజ్ కుమార్ ను అభినందించారు.అలాగే టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ కుమార్ ను కేసీఆర్ నాటిన మొక్క మా తమ్ముడూ అంటూ సంబోదిస్తూ కార్యకర్తల్లో ఉత్సహాన్ని నింపారు.సమావేశం అనంతరం బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు కోరుకంటి చందర్,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్,టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ కుమార్,టీబీజీకేఎస్ అద్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి,మాజీ జిల్లా గ్రందాలయ చైర్మన్ రఘువీర్ సింగ్,జాగృతి జిల్లా అద్యక్షుడు పెంట రాజేష్,బీఆర్ఎస్ సీనియర్ మహిళా నాయకురాలు మూల విజయ రెడ్డి,మథని మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజా,సర్థార్ రవిందర్ సింగ్, పట్టణ అద్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్,సురేందర్ రెడ్డి,శంకర్,లక్ష్మణ్, శ్రీనివాస్,గడప రాజయ్య,దాసరి ఉష,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments