బడిలో నీటి కష్టాలు…
-విద్యార్థులకు తప్పని తిప్పలు
– నీళ్లు లేక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అవస్థలు
– పట్టించుకోని పంచాయతీ కార్యదర్శులు.
మల్లాపూర్ ఫిబ్రవరి 06 ( ప్రజా కలం ప్రతినిధి)
గత పది రోజుల నుండి నీళ్లు లేక ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు గ్రామపంచాయతీలకు చెందిన వాటర్ ట్యాంకర్లతోనే తమ అవసరాలు తీర్చుకుంటున్న ఘటన మల్లాపూర్ మండలంలోని వాల్గొండ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల
అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో మండలంలోని వాల్గొండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కనీసం నీళ్లు కూడా లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. హై స్కూల్ వాల్గొండ తండా, ప్రైమరీ స్కూల్ వాల్గొండ గ్రామపంచాయతీ ఆధీనంలో ఉంటుంది. రెండు పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు మరుగుదొడ్లకు వెళ్లడానికి కూడా ట్యాంకర్ నుండి బకెట్ లో నీళ్లు నింపుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది . మధ్యాహ్న భోజననికి వంట చేయడానికి పాఠశాల నుండి ఆమడ దూరం నుంచి మంచినీళ్లు తెచ్చి పిల్లలకు వండి పెడుతున్నారు. పది రోజుల క్రితం పాఠశాలలకు వచ్చే బోరు చెడి పోయింది అని ఇరు గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకోలేదని గ్రామస్తులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ బోరు ప్రైవేట్ వ్యక్తులకు…
గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలకు నీళ్లు సరఫరా అయ్యే బోరు ను రెండు పాఠశాలకు వెళ్లే కనెక్షన్ ను తీసేసి ప్రవేటు వ్యక్తులకు అప్పగించి గ్రామపంచాయతీ నుండి విద్యుత్ బిల్లులు కూడా చెల్లిస్తున్నారని గ్రామ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.గ్రామ ప్రజలకు అందరికీ వచ్చినట్టే మిషన్ భగీరథ నీళ్లు వల్ల కు కూడా వస్తున్న బోరు కనెక్షన్ ఇచ్చి బిల్లు లు కట్టడం లో ఆంతర్యం ఏం ఉంది అని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. గత పది రోజుల నుండి పాఠశాల విద్యార్థులు నీళ్లు లేక అల్లాడుతున్న బోరుకు కనెక్షన్ ఇవ్వలేదని ఇరు గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు కనీసం పట్టించుకోలేదని ఎప్పుడు అడిగిన మాట దాటి వేసినట్టు గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. పాఠశాల స్థితిగతులు మార్చడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని వెంటనే బోరు బాగు చేయించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నీళ్లు అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తు కు బాటలు వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.