మా స్కూటీలు ఎక్కడ?
నిరుద్యోగ భృతి ఇవ్వండని డిమాండ్
సిటీ బ్యూరోఃఫిబ్రవరి14ః ప్రజాకలం ప్రతినిధి
చదువుకుంటున్న విద్యార్థిణిలు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థిణిలకు స్కూటీ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దీనితో విద్యార్థులు బోలేడు ఆశలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఏడాది పాలన కూడా పూర్తి చేసుకుంది. కానీ విద్యార్థిణుల కు ఇచ్చిన హామీ మాత్రం నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు. దీనితో కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలెబెట్టుకోవాలని విద్యార్థులు పోస్టు కార్డు ఉద్యమాన్ని తెరమీదికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాంక గాంధీని టార్గెట్ చేశారు.అందులో భాగంగా తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని లేఖలు రాశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున లేఖ రాసి తమ ఆవేధనను వ్యక్తం చేశారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదాని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు మూకుమ్మడిగా పోస్టు కార్డు పై రాసి లేఖలను ఢిల్లీకి పోస్టు చేశారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మా స్కూటీలు ఎక్కడ?
Recent Comments
Hello world!
on