ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలి
జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత
మెట్ పల్లి ప్రతినిధి మార్చి04 (ప్రజా కలం) ప్రతి ఒక్కరు మున్సిపల్ కు చెల్లించాల్సిన ఇంటి పన్ను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి బిఎస్ లతా సూచించారు.అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి బిఎస్ లత మెట్‌పల్లిలో ఇంటి నీటి పన్ను ట్రేడ్ లైసెన్స్, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పరిశీలించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ మెట్ పల్లి పట్టణ ప్రజలందరూ మున్సిపాలిటీకి కట్టవలసిన ఇంటి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్స్ సకాలంలో చెల్లించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్, టిపి ఓ రాజేంద్రప్రసాద్, ఆఫీసర్ మిర్జా అజ్మతుల్లా బేగ్, టిపి ఎస్ అశోక్,ఆర్ ఐ అక్షయ్, ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఉంటుంది.