కాంగ్రెస్ నాయకుడు ఎండి రజాక్ హత్య కేసులో కానరాని పురోగతి
పార్టీ సీనియర్ నాయకుడు ఎండి రైసుద్దీన్
మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 16 (ప్రజాకలం) (రిపోర్టర్: మహ్మద్ అజీమ్) :కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి రజాక్ హత్య జరిగి ఏడాదిన్నర గడుస్తున్న అసలైన హంతకులు వణుకు బెనుకు లేకుండా ఇప్పటికీ ప్రజల మధ్య దర్జాగా తిరుగుతున్నారని కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. దీనిపై ఆదివారం పార్టీ సీనియర్ నాయకులు ఎండి రైసుద్దీన్ ఆధ్వర్యంలో, పార్టీ నాయకులు స్థానిక సి ఐ, ఎస్సై లకు వినతి పత్రం సమర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుస హత్యలతో అట్టుడికిన మెట్పల్లి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి రజాక్ హత్య తీవ్ర సంచలనం రేపడమే గాక అప్పట్లో కోరుట్ల నియోజకవర్గంలో శాంతి భద్రతల వైఫల్యం రాష్ట్రవ్యాప్తంగా చర్చనియాంశమైందని అన్నారు. హంతకులను పెంచి పోషిస్తున్న సదరు రాజకీయ నాయకులు ఈ హత్యతో సంబంధమున్న అసలైన హంతకులకు పరోక్షంగా మద్దతిస్తున్నారని, వారి అండతోనే అసలైన హంతకులు జనం మధ్య బహిరంగంగా తిరుగుతున్నారని మండిపడ్డారు. 2023 ఆగష్టు 26 న నిజామాబాదు జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం పాల్గొని తిరిగి వచ్చిన ఎండి రజాక్ ను తన స్వగ్రామం ఐలాపూర్ వెళ్తున్న క్రమంలో దారి కాచి కిరాతంగా హత్య చేశారని తెలిపారు. పోలీసులు దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించి ఇట్టి కేసును పునః విచారణ చేసి తప్పించుకు తిరుగుతున్న అసలైన నేరస్తులను జైలుకు పంపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంట ప్రణయ్, మెట్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంగు గంగాధర్, నాయకులు ఆసిఫ్, పాపేశ్, జయరాజ్, పొన్నాల ఎల్లేశ్ తదితరులు పాల్గొన్నారు