- నిఖిల్ భరత్ విద్యార్ధి కి పి హెచ్ డి లో పట్టా.
మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 11(ప్రజాకలం) (రిపోర్టర్: మహ్మద్ అజీమ్) :పట్టణంలోని నిఖిల్ భరత్ కాన్వెంట్ హై స్కూల్ నర్సరీ నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. అభ్యసించిన ఎస్. రచన శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి న్యూట్రిషన్ పరిశ్రమలో యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ను పొందారు. రైతు కుటుంబానికి చెందిన చురుకైన విద్యార్థి పాఠశాల దశ నుండి వ్యవసాయం పట్ల ఎక్కువ మక్కువ చూపించేవారు. కాగా పాఠశాలలో నిర్వహించిన ప్రతి సెమినర్స్ లో ఎప్పుడు వ్యవసాయం మీద మాట్లాడేవారు.తనకు వ్యవసాయంలో పరిశోదనలు చేసి ఆదునిక వ్యవసాయంలో ఇంకా ఎక్కువ ఉత్పత్తులను పెంచాలని తపనతో యం ఎస్సి అగ్రికల్చర్ చేసి అదే యూనివర్సిటీ నుండి పి హెచ్ డి చేసి జిల్లాలోనే న్యూట్రిషన్ లో పి హెచ్ డి పొందిన ఏకైక మహిళగా నిలిచారు. ప్రస్తుతం తాను నేషనల్ ఇన్ డిగ్రీ ఆఫ్ సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్ గా కొనసాగుతున్నారు. వీరు సాదించిన విజయానికి పాఠశాల ప్రిన్సిపాల్ వి బి మహర్షి అభినందిచారు. భావిష్యత్తులో ఇంకా ఎన్నో నూతన పరిశోధనలు చేసి న్యూట్రిషన్ అభివృద్ధికి ద్రోహదపడాలని ఆకాంక్షించారు. ఆమెను పాఠశాల విద్యార్ధి దశ నుండి ప్రోత్సహించిన ప్రదానోపద్యాయురాలు సి హెచ్ అనిత ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.