హోలీ వేడుకల్లో పూర్వ విద్యార్థులు
– 1992-93 పదో తరగతి పూర్వ విద్యార్థుల హోలీ సంబరాలు
మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 14 (ప్రజాకలం) (రిపోర్టర్: మహ్మద్ అజీమ్) : మెట్ పల్లి లో పదవ తరగతి ( 1992-93 ) పూర్వ బ్యాచ్ విద్యార్థులు శుక్రవారం హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని పదవ తరగతి (1992-93) బ్యాచ్ వారు తమ సన్నిహితులకు ఒకరినొకరు రంగులను చల్లుకుని ఆనందంలో మునిగితేలారు. ఆత్మీయ మిత్రులతో హోలీ పండుగ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో ఒకరినొకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అత్యంతం హోలీ వేడుకతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అత్మీయ మిత్రులు, పూర్వ విద్యార్థులు మహమ్మద్ ఆజీమ్, సుధాకర్, సంతోష్, హరి ప్రసాద్, వెంకటేష్, భుమేశ్వర్, సత్యనారాయణ, వేణుగోపాల్, పుల్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.