మీనాక్షి నటరాజన్ ఎఫెక్ట్, నేతలకు పదవులు
విజయశాంతికి కలిసొఛ్చిన కాంగ్రెస్
త్యాగాలు గుర్తించిన అధిష్టానం, దయాకర్ ను వరించిన ఎమ్మెల్సి
పార్టీని కోసం పనిచేసిన శంకర్ నాయక్
కెసిఆర్ ఫ్యామిలీ ని టార్గెట్ చేసిన కాంగ్రెస్
హైదరాబాద్: మార్చ్ 10 స్టేట్ బ్యూరో
కాంగ్రెస్ పార్టీలో నాయకులకు సమయము సందర్భం కలిసి వస్తే కచ్చితంగా న్యాయం జరుగుతుంది అని తెలుస్తుంది. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవులు కట్టబెట్టడంలో ఎటువంటి అన్యాయం జరగదని స్పష్టమైంది. అందులో భాగంగానే తాజాగా ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీలని చెప్పక తప్పదు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి కి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీలు గా ప్రకటించడం..
కెసిఆర్ ఫ్యామిలీ ని టార్గెట్ చేసిన కాంగ్రెస్
విజయ శాంతిని రంగంలోకి దింపిన నేతలు
కాంగ్రెస్ లో ఉంటూ మౌనంగా ఉన్న విజయశాంతికి పదవి ఇవ్వడం వెనకాల కాంగ్రెస్ వ్యూహం దాగి ఉందని తెలుస్తోంది. కెసిఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఎందుకే విజయశాంతిని తెరమీదకి తీసుకొచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. గతలో విజయశాంతి ఫైర్ బ్రాండ్ గా తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. తిరిగి అదే ఫైర్ ను కొనసాగించి బీఆర్ఎస్పై కాంగ్రెస్ తన తుపాకిని ఎక్కువ పెట్టింది అని తెలుస్తోంది. అంచనాలకు భిన్నంగా అనూహ్యంగా విజయశాంతి పేరు తెరమీదికి రావడంతో ప్రతిపక్షంలో ఉన్న పార్టీని మాటలతోటాలతో ముప్పు తిప్పల పెట్టాలన్న లక్ష్యం ఉందని తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి ప్రజలకు సేవ చేశారు. మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ రాకతో మెదక్ పై ఫోకస్ పెట్టింది ముఖ్యంగా కెసిఆర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేసింది. అందులో భాగంగానే విజయశాంతికి ఎమ్మెల్సీ అవకాశం కలిపిస్తే వారిని టార్గెట్ చేయడం పార్టీని బలోపేతం చేయడం రెండు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఇన్నాళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతికి ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీ పదవి అప్పగిస్తున్నట్లు పార్టీ నేతలు చర్చ చేస్తున్నారు.
నాటి త్యాగం ఫలితమే నేటి పదవి
ఎమ్మెల్సీగా అద్దంకకి దయాకర్ కు అవకాశం
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న నాయకుడు అద్దంకి దయాకర్. అధికారంలో ఉన్న లేకపోయినా పార్టీ కోసం నిరంతరం శ్రమించాడు ఆయన కృషిని కాంగ్రెస్ పెద్దలు గుర్తించినట్లు స్పష్టంగా తెలుస్తుంది అందులో భాగంగానే ఈసారి ఎమ్మెల్సీ పదవిని ఆయనకు అప్పగించారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో తన ఆశలను నీరుగార్చిన అధిష్టానం ఈసారి తనకు న్యాయం చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తాను చేసిన త్యాగానికి ప్రతిఫలం అందించారని చెప్పక తప్పదు. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ అడిగిన, దక్కలేదు. వరంగల్ పార్లమెంటు టికెట్ ఆశించిన నిరాశే ఎదురైంది. అయినా పార్టీ పైన సనగ లేదు గుణగలేదు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పార్టీలో కొనసాగుతూ వచ్చాడు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏఐసీసీ తనకు అవకాశం లభించడంతో తాను చేసిన త్యాగానికి ఫలితం అని స్పష్టమని కాంగ్రెస్ పార్టీ మరొకసారి రుజువు చేసింది. పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు కాంగ్రెస్ కచ్చితంగా న్యాయం చేస్తుంది అని చెప్పడానికి అద్దంకి దయాకర్ కు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవే నిలువెత్తు నిదర్శనం అని తెలుస్తుంది. ఈ సారి వెనక బడిన వర్గాలకు పదవులు కట్ట బెట్టిన కాంగ్రెస్ మిగతా పార్టీలను చిక్కుల్లో పడేలా చేసిందని తెలుతుంది..
మీనాక్షి నటరాజన్ ఎఫెక్ట్
Recent Comments
Hello world!
on