యువత ఇండియన్ ఆర్మీలో చేరేందుకు అవకాశాన్ని వినియోగించుకోవాలి
దేశానికి సేవలందించేందుకు యువతకు మంచి అవకాశం
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
సికింద్రాబాద్ మార్చి 16, ( ప్రజాకలం న్యూస్ ):
.ఆదివారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేస్తూ …దేశానికి సేవలందించేందుకు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో చేరేందుకు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఎంతో దోహదపడుతోందన్నారు. మెదక్ జిల్లాలోని యువతీ యువకులు ఇండియన్ ఆర్మీలో చేరి సేవలందించేందుకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ద్వారా అవకాశం కల్పించిందని కలెక్టర్ తెలిపారు.
దీనిలో భాగంగా ఇండియన్ ఆర్మీ అనివీర్ రిక్రూట్‌మెంట్ 2025–2026 రిక్రూటింగ్ సంవత్సరానికి అగ్నివీర్ కోసం ఈనెల 12వ తేదీ నుంచి www.joinindianarmy.nic.in వెబ్ పోర్టల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగిందని ఇండియన్ ఆర్మీలో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవచ్చని… విషయాలపై ఆయా కార్యాలయాల నుంచి వెబ్‌సైట్‌లో అభ్యర్థించేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్‌పేజీ www.joinindianarmy.nic.in లింక్‌తో నోటిఫికేషన్‌ను పోస్టు చేయడం జరిగిందన్నారు. అగ్నివీర్ 2025–20-26 సంవత్సరానికి ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ www.joinindianarmy.nic .in, hhttp://www.joinindianarmy.nic.in లో విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.
దీనికి సంబంధించి ఎంపిక ప్రక్రియకు 17.5 నుంచి 21 సంవత్సరాలు వయస్స ఉండి… 8, 10, ఇంటర్మీడియట్ (12వ తరగతి), ఐటీఐ, పాలిటెక్నిక్ ఉత్తీర్ణత (కేటగిరీల వారీగా మార్పలుంటాయి.) అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్లో కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని… ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు (ఈఎఫ్‌టీ), రన్నింగ్, బీమ్ (పుల్అప్స్), నైన్ ఫీట్ డిచ్, జిగ్ జాగ్ బ్యాలెన్స్ పరీక్షలు ఉంటాయని దీంతో పాటుగా ప్రవేశ పరీక్ష, శారీరక దృఢత్వ వైద్య తదితర పరీక్షలను నిర్వహిస్తారని తెలిపారు. మెరిట్ జాబితా ప్రకారం మొత్తం పనితీరు ఆధారంగా తుది ఎంపిక ఉంటుందన్నారు. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు అధికారికంగా శిక్షణ అండ్ ఇండక్షన్ ఉంటాయని స్పష్టం చేశారు. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి భారత పౌరులై ఉండాలని.. యూఎన్ఎమ్ వైవాహిక స్థితిలో ఉండాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. దేశానికి సేవలందించేందుకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఎంతో దోహడపడుతోందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు.
ఇతర వివరాలకు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, సికింద్రాబాద్ – 040-27740059 సంప్రదించాలన్నారు
దేశానికి సేవలందించేందుకు యువతకు మంచి అవకాశం
Recent Comments
Hello world!
on