Friday, April 4, 2025
Homeతెలంగాణరైతులకు సోలార్ ప్లాంట్లపై అవగాహనా సదస్సు

రైతులకు సోలార్ ప్లాంట్లపై అవగాహనా సదస్సు

రైతులకు సోలార్ ప్లాంట్లపై అవగాహనా సదస్సు
పెద్దపల్లి,మార్చి 22:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పీఎం కుసుమ్-ఎ పథకం కింద సోలార్ ప్లాంట్ల కోసం తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేసుకున్న రైతుల కోసం జిల్లాకేంద్రంలోని ఎన్‌పీడీసీఎల్ కార్యాలయంలో శనివారం అవగాహనా సదస్సు నిర్వహించినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ కె.మాధవరావు తెలిపారు.ఈ సదస్సుకు జిల్లాలోని 89 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా 60 మంది హాజరైనట్లు ఎస్ఈ తెలిపారు.ఈ సదస్సులో రెడ్కో సంస్థ ప్రతినిధులు దరఖాస్తుదారుల సందేహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నివృత్తి చేసినట్లు తెలిపారు.సోలార్ ప్లాంట్ సబ్ స్టేషన్ కు 5 కి.మీ లోపు ఉంటే మంచిదని,దీనివల్ల 11 కేవీ లైన్ ఖర్చు తగ్గుతుందన్నారు.1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 3 నుంచి 3.5 ఎకరాల భూమి అవసరం ఉటుందని,1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 3.2 కోట్లు ఖర్చవుతుందనిని వివరించారు. జాతీయ బ్యాంకులు రూ.2 కోట్ల వరకు రుణం అందిస్తాయని,రైతులు 25 శాతం రూ. 80 లక్షలు పెట్టుబడి పెడితే,బ్యాంకులు రూ. 2.4 కోట్లు రుణం ఇస్తాయని,10 శాతం రూ.32 లక్షలు పెట్టుబడి పెడితే,బ్యాంకులు రూ. 2.88 కోట్లు రుణం ఇస్తాయని,బ్యాంకు రుణం 10 సంవత్సరాల కాలపరిమితితో అందుబాటులో ఉంటుందని తెలిపారు.రైతులు 0.5 నుంచి 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చని,1 మెగావాట్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు 0.5 మెగావాట్లుగా మార్చుకోవచ్చన్నారు.దీనికి ఎన్‌పీడీసీఎల్,రెడ్కో ఆమోదం అవసరమన్నారు.మార్చి 28 లోపు 1 మెగావాట్ ప్లాంట్ కు రూ.1 లక్ష, 2 మెగావాట్ ప్లాంట్ కు రూ. 2 లక్షలు డిపాజిట్ చెల్లించాలని తెలిపారు.రెడ్కో డిపాజిట్ చెల్లించిన వారిని ఎంపిక చేసి మంజూరు ఉత్తర్వులు ఇస్తామన్నారు.మంజూరు కానివారికి డిపాజిట్ తిరిగి చెల్లిస్తారని తెలిపారు.మంజూరు ఉత్తర్వులు పొందిన రైతులు తప్పనిసరిగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు.సోలార్ ప్లాంట్ వద్ద వాచ్‌మెన్,ఇద్దరు కార్మికులు,ఐటీఐ లేదా డిప్లొమా చదివిన సిబ్బందిని నియమించాలని పేర్కోన్నారు.సోలార్ ప్లాంట్ నిర్మాణం డిసెంబర్ లోపు పూర్తి చేయాలని,జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభం కావాలన్నారు.ప్రతి నెల రీడింగుల ప్రకారం బిల్లులు చెల్లిస్తారని,ప్రస్తుతం కొత్త దరఖాస్తులు స్వీకరించడం లేదని తెలిపారు.సోలార్ ప్లాంట్ కమర్షియల్ కిందకు వస్తుంది.రైతులు ఆదాయపు పన్ను చెల్లించాలన్నారు.ప్లాంట్ 25 సంవత్సరాల వరకు నడుస్తుందని,ఒక రైతుకు 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్ మాత్రమే మంజూరు చేస్తారని తెలిపారు.సోలార్ ప్లాంట్ పరికరాలపై జీఎస్టీ వర్తిస్తుందన్నారు.మహిళా సమాఖ్యలకు ప్రభుత్వ భూమిలో సోలార్ ప్లాంట్ నిర్మాణానికి ప్రత్యేక మంజూరులు ఉన్నాయని రెడ్కో సంస్థ ప్రతినిధులు,బ్యాంకర్లు దరఖాస్తుదారుల వీడియో కాన్ఫరెన్స్ వివరించారు.1/70 చట్టం కింద భూముల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వినియోగ దారులకు తదుపరి ఎటువంటి సందేహాలున్న హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి జవాబు పొందవచ్చునని,హెల్ప్ లైన్ త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు సూపరింటెండెంట్ ఇంజనీర్
కె.మాధవరావు తెలియజేశారు.ఈ సదస్సులో డివిజనల్ ఇంజనీర్ బి.రవి,సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు,ఏడీఈ సుగుణయ్య,టెక్నికల్ ఎఈ,రెడ్కో ఇంజనీర్,బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments