*బీబీనగర్ తహశీల్దార్ శ్రీధర్ సస్పెండ్
– అధికారులు విధులు పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తప్పవు..
– జిల్లా కలెక్టర్ హనుమంతరావు
*భువనగిరి/బీబీనగర్ మార్చి 21 ప్రజాకలం*:బీబీనగర్ తహశీల్దార్ శ్రీధర్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు సస్పెండ్ చేశారు.శుక్రవారం ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో ఖాళీస్థలంలో ప్లాట్లు ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాస్ బుక్ డేటా కరెక్షన్ ద్వారా పాస్ బుక్ జనరేషన్ కు బాధ్యులైన తహశీల్దార్ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తప్పవన్నారు.
బీబీనగర్ తహశీల్దార్ శ్రీధర్ సస్పెండ్
Recent Comments
Hello world!
on