మతపరమైన వివక్షపై బీజేపీ ఆగ్రహం
*విద్యార్థిని వేధించిన సెయింట్ ఆన్స్ స్కూల్ యాజమాన్యం
*పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్
*పోలీసుల హామీతో ఆందోళన విరమణ
పెద్దపల్లి,మార్చి 25:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అమర్ నాథ్ అనే విద్యార్థి మంగళవారం హనుమాన్ దీక్ష మాల ధరించి పాఠశాలకు హాజరయ్యాడు. అయితే,పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ఎండలో నిలబెట్టి, పాఠశాలకు రావద్దని మానసికంగా, శారీరకంగా వేధించింది.ఈ సంఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు,హనుమాన్ దీక్షాపరులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. విద్యార్థిని వేధించిన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.అనంతరం బీజేపీ జిల్లా అద్యక్షుడు సంజీవ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం మతపరమైన వివక్ష చూపడం సిగ్గుచేటని అన్నారు. విద్యా సంస్థలు కుల,మతాలకు అతీతంగా ఉండాలని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు పల్లె సదానందం,కడారి అశోక్ రావు,అమరగాని ప్రదీప్ కుమార్,శివంగారి సతీష్,పర్శ సమ్మయ్య,జంగా చక్రధర్ రెడ్డి,బెజ్జంకి దిలీప్ కుమార్,హనుమాన్ దీక్షాపరులు,తదితరులు పాల్గొన్నారు.
మతపరమైన వివక్షపై బీజేపీ ఆగ్రహం
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on