*బోర్డు మారేది ఎన్నడు* …?
రాయికల్ మార్చి 26 (ప్రజా కలం ప్రతినిధి)
సుమారు 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన బోర్డు తుప్పు పట్టి పోయినప్పటికీ మార్చడానికి మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు. రాయికల్ మండల ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆసుపత్రికి lసంబంధించిన బోర్డును గతంలో అధికారులు ఏర్పాటు చేశారు. అది ఆసుపత్రి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు తుప్పు పట్టిపోయినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మార్చడమే లేదు. తుప్పు పట్టిపోయిన బోర్డు స్థానంలో కొత్త బోర్డును ఏర్పాటు చేయవలసి ఉండగా అధికారులు మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించూ స్పందించడమే లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.