అప్రమత్తంతోనే సైబర్ నేరాలు అడ్డుకట్ట
మెట్ పల్లి డిఎస్పీ రాములు
సైబర్ ట్రాఫ్ లో విద్యార్థులు చిక్కుకోవద్దు
మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి
మెట్ పల్లి: ప్రతినిధి మార్చి03 ( ప్రజాకలం) సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మెట్ పల్లి డిఎస్పి రాములు అన్నారు. సోమవారం పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొత్త నెంబర్ల నుండి వచ్చే కాల్స్, లింక్స్ ఏ పి కె మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మెట్పల్లి డిఎస్పి రాములు తెలిపారు.పోలీస్ యూనిఫామ్ తో ఎవరైనా వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటే స్పందించవద్దని,సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ఆయుధం, సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలని సూచించారు.సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తీయని మాటల వలలో పడి వ్యక్తిగత విషయాలు, ఫోటోలు ఇవ్వవద్దని, సోషల్ మీడియా అకౌంట్స్ కు తప్పనిసరిగా లాక్ పెట్టుకోవాలని అన్నారు. ఎవరైనా వేధిస్తే వెంటనే పోలీసు వారిని సంప్రదించాలని,మొబైల్ ఫోన్ కి ఆఫర్లు, డిస్కౌంట్లు పేరుతో వచ్చే లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని,అపరిచితుల నుంచి వచ్చే ఫోన్, మెసేజ్ లకు, కొత్త నెంబర్ ల నుండి వచ్చే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉన్నందున వాటిని నమ్మవద్దన్నారు. సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి రకరకాలుగా బయటకు వస్తున్నారని, వాటి కట్టడికి అప్రమత్తత, అవగాహన ఆయుధమని నిరంజన్ రెడ్డి అన్నారు. లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు.కస్టమర్ కేర్ నెంబర్లను గూగుల్ లో అస్సలు వెతుకవద్దని,వాట్సప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కి దూరంగా ఉండాలన్నారు.లాటరీ ఆఫర్ లంటూ వచ్చే మెసేజ్లను నమ్మవద్దన్నారు.ఈ రిటర్న్స్ కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దని,పాస్ వర్డ్, ఓటిపి, పిన్ లాంటి వివరాలను ఎవరికి షేర్ చేయవద్దని,పోలీస్ అధికారి పేరుతో మీ ఆధార్ గురించి అడిగితే చెప్పకూడదని ఆయన అన్నారు. ఎవరైనా కాల్ చేసి, వారు పొరపాటున మీ యూపీఐ ఐడి కి డబ్బు పంపామని, వారు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరితే స్పందించవద్దని పేర్కొన్నారు. ఇది కూడా ఒక మోసం సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కి ఫోన్ చేయాలని తెలిపారు.తరువాత ఇట్టి అవగాహన సదస్సులో జిల్లా సైబర్ క్రైమ్ డిపార్టుమెంటు నుండి వచ్చిన సైబర్ క్రైమ్ ఆర్ ఎస్ ఐ కృష్ణ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించారు.అపరిచితులు పంపే మెసేజ్లకు రిప్లై ఇవ్వదన్నారు. బ్యాంకు లావాదేవీలు, పిన్, ఓటిపి తదితర ఏ నెంబర్లను వేరే వారికి తెలియపరచవద్దన్నారు. బ్యాంకులు గానీ, పని చేసే కార్యాలయాలు గాని ఫోన్లో ఎలాంటి సమాచారం అడగవని, అవసరమైతే నేరుగా కలవమని చెబుతారని పేర్కొన్నారు. ఫోన్లలో ఏ కొంత సమాచారం ఇచ్చిన అకౌంట్ లోని డబ్బు, మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ, తమ కుటుంబీకులు, బంధువులు తెలిసిన వారికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు