గంజాయి విక్రేత అరెస్ట్
మెట్ పల్లి: (కోరుట్ల) ప్రతినిధి, మార్చి 22 (ప్రజాకలం): మేడిపల్లి గ్రామా శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద జాతీయ రహదారి 63 పై ఇబ్రహింపట్నం ఎస్సై. ఏ. అనిల్ తన సిబ్బంది తో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, పోగుల అజయ్ అనే యువకుడు నిజామాబాద్ వైపు నుండి మెట్ పల్లి వైపు ఒక మోటార్ సైకిల్ పై వస్తు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీనితో వెంటనే పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు.విచారణలో ఆ యువకుడు గంజాయి విక్రయిస్తున్నట్లు తేలింది. అజయ్ కోరుట్ల పట్టణంలో వినాయక విగ్రహాలు తయారు చేసే షాపులో కూలీగా పనిచేస్తున్నాడు.అతని వద్ద నుండి 300 గ్రాముల గంజాయి, ఒక హీరో బైక్ ఒక ఐఫోన్, మొబైల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 15,000 వేలని పోలీసులు తెలిపారు.అజయ్ మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన మొహమ్మద్ అజార్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు వాటిని చిన్న చిన్న ప్యాకెట్ లు గా చేసి కోరుట్ల, మెట్ పల్లి హైదరాబాద్ పరిసర గ్రామాలలో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. గతంలో కూడా కోరుట్ల పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన ఒక గంజాయి కేసు, ఇతర రెండు కేసులలో లో జైలుకు వెళ్ళినట్లు అతను ఒప్పుకున్నాడు.నిందితుడిపై ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు ఈ కేసులో పరారిలో ఉన్న మరొక నిందితున్ని త్వరలోనే పట్టుకొని కోర్టులో హాజరు పరుస్తామని సి.ఐ. ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు.