మైలర్ దేవ్ పల్లి అలీ నగర్ కాలనీ లో విషాదం
ఒక బకెట్ లో పాప నీళ్లలో పడి మృతి చెందిన ఘటన
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న
మైలర్ దేవ్ పల్లి పోలీసులు
రాజేంద్రనగర్(ప్రజా కలం)
రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అలీ నగర్ కాలనీ లో విషాదం జరిగింది. 15 రోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.తమిళనాడుకు చెందిన మనీ, విజ్జి భార్య భర్తలు, వీరికి గత 15 రోజుల క్రితం పాప జన్మించింది.మనీ అలీ నగర్ లోని జయ, కో బిస్కెట్ కంపెనీలో పని చేస్తూ వర్కర్స్ క్వార్టర్స్ లో గత నాలుగు సంవత్సరాలుగా నివసిస్తున్నారు. బుధవారం నాడు బాలిక తల్లి మధ్యాహ్నం తన పసిబిడ్డను గదిలో పడుకోబెట్టి స్నానానికి వెళ్ళింది. తిరిగి వచ్చి చూసే సరికి పాప మంచం పై కనిపించలేదు. పసిబిడ్డ తల్లి చుట్టుపక్కల గాలించారు.
ఒక బకెట్ లో పాప నీళ్లలో పడి ఉన్న విషయాన్ని గమనించారు. వెంటనే ఆ పాపను స్థానిక సహాయంతో ఆసుపత్రి కి తరలించారు. అప్పటికే పాప మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన మైలర్ దేవ్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
.
మైలర్ దేవ్ పల్లి అలీ నగర్ కాలనీ లో విషాదం
Recent Comments
Hello world!
on