*పేకాట స్థావరంపై సి సి ఎస్ పోలీసుల దాడులు*
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, మార్చి 28 (ప్రజాకలనం) :కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సీఐ ఎస్సైలు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 22920 రూపాయలు, ఆరు మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని కోరుట్ల పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేయడం జరిగింది.జిల్లా ఎస్పీతో అక్రమ,అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెట్టారు. పటిష్టం చేసి,పక్క సమాచారంతో దాడులు జరిగినట్లు ఎస్సై ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.