గుండెపోటు తో దార శ్రీనివాస్/ వార్డు ఆఫీసర్ మృతి
పాలేరు మార్చి 04(ప్రజా కలం ప్రతినిధి)
కూసుమంచి మండలం పరిధిలోని మంగళవారం జక్కేపల్లి ఎస్సీ కాలనీ గ్రామానికి చెందిన దార శ్రీనివాస్ మంగళవారం గుండెపోటుతో మరణించారు.జక్కేపల్లి గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేసిన దార శ్రీనివాస్ ఉద్యోగిన్నతి ద్వారా బదిలీపై వెళ్లి ఇల్లందు మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఉదయం అకస్మాత్తుగా ఛాతినొప్పికి గురైన శ్రీనివాస్ ను కుటుంబ సభ్యులు గమనించి ఖమ్మం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం
ఆంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.మృతునికి భార్య,కుమారుడు,కూతురు ఉన్నారు.అందరితో కలివిడిగా ఉండే శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. అందరికి సూపరిచితుడు ఎందరికో రెవిన్యూ పరంగా సేవలు చేసిన జక్కేపల్లి గ్రామ రెవిన్యూ అసిస్టెంట్ గా భాద్యతలు నిర్వర్తించి, వి ఆర్ ఏ సంఘం మండల అధ్యక్షుడి గా, జిల్లా కార్యవర్గ సభ్యునిగా పనిచేస్తున్నాడు
గుండెపోటు తో దార శ్రీనివాస్/ వార్డు ఆఫీసర్ మృతి
Recent Comments
Hello world!
on