Saturday, April 5, 2025
HomeUncategorizedఅప్పులు, తప్పుల పై చర్చ సాగాలి

అప్పులు, తప్పుల పై చర్చ సాగాలి

అప్పులు, తప్పుల పై చర్చ సాగాలి
మాజీ సీఎంకు తాజా సీఎం సవాల్
బ్యూరో: మార్చ్ 16: ప్రజా కలం ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జరిగిన అప్పులు తప్పుల పై చట్టసభల్లో చర్చ సాగాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధిని మాత్రమే బిఆర్ఎస్ నాయకులు పెరిమీదికి తీసుకొస్తున్నారు తప్ప, అప్పులు వడ్డీల చెల్లింపు విషయాలను ఎందుకు ప్రస్తావించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించని వడ్డీలు అప్పుల చెల్లింపులకి 15 నెలలు గడిచిందని వివరించారు. కెసిఆర్ ప్రభుత్వం సుమారు 8 లక్షల కోట్ల అప్పులు చేయగా వాటికి వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని, ప్రభుత్వం గాడిలో పడేందుకు 15 నెలలు సమయం తప్ప లేదన్నారు. గత ప్రభుత్వం 11 శాతం వడ్డీ చెల్లించేందుకు అప్పులు తీసుకొస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా సంస్థలు అధికారులతో మాట్లాడి కేవలం 7 శాతం వడ్డీలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయినప్పటికీ ఆ అప్పులు అవడ్డీలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించని బకాయిలు తమపైన భారంగా మారాయని అసెంబ్లీ వేదికగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సీఎం దీటుగా జవాబు ఇచ్చారు. కాలేశ్వరం ప్రాజెక్టు కాదన్న ఆయన అది కూలేశ్వరం అని వెల్లడించారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే ఈ ప్రాజెక్టు నిర్మించి డబ్బులు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు వైట్ హెల్ప్ గా మారిందని ఆయన స్పష్టం చేశారు. నదుల అనుసంధానం పునరుద్ధరణ కోసం ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తామని చెప్పినప్పటికీ, అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చిన ఆనాటి ప్రభుత్వం ప్రజల పైన పెను భారాన్ని మోపిందని మండిపడ్డారు. వాటన్నింటినీ పక్కనపెట్టి తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఉద్యమ కారులు,కవులకు న్యాయం ఏది?
తెలంగాణ ఉద్యమకారులు కవులు కోసం గత ముఖ్యమంత్రి ఏనాడు ఎందుకు మాట్లాడలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు.కవులు, ఉద్యమకారులకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. అందే శ్రీ జయ జయ హే తెలంగాణ పాటను ఎందుకు గుర్తించలేకపోయారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రగతి భవన్ ను నిర్మించిన కేసీఆర్,సీఎం సీట్ లో చిన జీయర్ స్వామిని కూర్చో పెట్టారు ఎందుకు అని ప్రశ్నించారు? యాదగిరి గుట్టకు ఉన్న ప్రత్యేక తెలియదా?
సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగు చేశారని ఆరోపించారు.
కృష్ణ జలాల వాటా కెసిఆర్ హరీష్ రావు పాపమే.రేవంత్ రెడ్డి
కృష్ణ జలాల వాటాపై కెసిఆర్ హరీష్ రావుచేసిన తప్పు వల్లనే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.2021లో కృష్ణ జలల పై రైతులకు మరణ శాశనం రాసింది కెసిఆర్, హారీష్ రావు అని పేర్కొన్నారు. ఏపీ 36శాతం, తెలంగాణ కు 64 శాతం వాటా కాని అందుకు భిన్నంగా వారు ఒప్పుకొని సంతకాలు చేశారని అసెంబ్లీలో వెల్లడించారు. ఇదే విషయమే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఢిల్లీలో కొట్లాడుతుందని స్పష్టం చేశారు.కెసిఆర్ 100 ఏళ్ళు ప్రతి పక్షంలో ఉండాలి అని ఆశించారు.మరో వైపు బీ ఆర్ ఎస్ మార్చురిలో ఉందని జోస్యం చెప్పారు.ప్రతిపక్ష హోదా కేటీఆర్ హరీష్ రావులకు అవసరం అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అసలైన జర్నలిస్ట్ ఎవరు?
జర్నలిస్ట్ ఎవరో జర్నలిస్టు సంఘాలు వివరాలు ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా ఆయన కోరారు. సోషల్ మీడియా పేరుతో ఇష్టాను సారంగా మాట్లాడుతున్న వారు ఎవరైనా సరే ఊరుకోబోమని హెచ్చరించారు. అవసరమనుకుంటే చట్టాన్ని సైతం సవరించి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇంట్లో ఉండే మహిళలను తెరి మీదికి తీసుకువచ్చి వారిని టార్గెట్ చేస్తే ఊరుకోపోమన్నారు. వారు మనుష్యులేని,మీకు అమ్మ చెల్లి, బిడ్డలు లేరాని ప్రశ్నించారు?
విమర్శిస్తే మంచిది కానీ మహిళల పేర్లు తెస్తే తాట తీస్తాని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments