పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాలను
పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
జగిత్యాల ప్రతినిధి మార్చి21 (ప్రజా కలం)శుక్రవారం రోజున జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హై స్కూల్ మరియు పురానణి పేట గవర్నమెంట్ హై స్కూల్ కోరుట్ల పట్టణంలోని ఎస్ ఎఫ్ ఎస్ ప్రైవేట్ హై స్కూల్లో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రలను లను పరిశీలించారు.
జిల్లాలో మొత్తం 11,855 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు అని వీరి కోసం 67 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు.పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతత వాతావరణంలో జరుగుతున్నాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, జిల్లా విద్యా శాఖ అధికారి రాము, ఎమ్మార్వో రామ్మోహన్ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు
పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
Recent Comments
Hello world!
on