మైలార్దేవ్పల్లిలో రెచ్చిపోయిన దొంగలు
ఎటిఎం కు నిప్పు పెట్టిన దొంగలు
మంటల్లో మిషన్ 7 లక్షల కరెన్సీ నోట్లు
మైలార్ దేవ్ పల్లి మధుబన్ వద్ద చోటుచేసుకున్న ఘటన
రాజేంద్రనగర్, మర్చి 04,(ప్రజా కలం)
రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్ పల్లిలో దొంగలు రెచ్చి పోయారు. మధుబన్ కాలనీ వద్ద ఎస్బిఐ ఎటిఎం లోకి చొరబడ్డ ముఠా సభ్యులు తెరవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు.ఎంతకీ తెరుచు కోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.మంటల్లో మిషన్ ,7 లక్షల కరెన్సీ నోట్లు కాలి బూడిద అయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు.వరుసగా జరుగుతున్న ఏటీఎం దొంగతనాలతో ప్రజల ఆందోళన చెందుతున్నారు పోలీసులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దుండగులను పట్టుకోవడానికి ఎస్వోటీ పోలీసులు రంగాల్లోకి దిగారు. ఇటీవల రావిరాల గ్రామంలో ఎస్బిఐ ఎటిఎం చోరీ జరిగిన ఘటన మరవక ముందే మళ్లీ మైలార్దేవ్పల్లిలో ఘటన జరగడం అందరిని కలవరం పెడుతుంది పోలీసులకు సవాలుగా మారిన ఏటీఎం దొంగతనాలు
మైలార్దేవ్పల్లిలో రెచ్చిపోయిన దొంగలు
Recent Comments
Hello world!
on