బిగ్ బ్రేకింగ్ న్యూస్
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల ఆత్మహత్యా యత్నం
పెట్రోల్ బాటిల్తో రైతుల ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం
రైతులను అడ్డుకున్న ఆదిభట్ల పోలీసులు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్, (ప్రజా కలం)
మహేశ్వరం నియోజకవర్గం కొంగర రావిరాల (కొంగర కుర్దూ) గ్రామానికి చెందిన రైతులు
సర్వేనెంబర్ 13 గల రైతుల పట్టా భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్న భూమిలో ఇటీవల ప్రభుత్వం సర్వే ప్రకారం 13 నెంబర్ మీదుగా 300 ఫీట్ల రోడ్డు వేయుటకు ప్రభుత్వం సర్వే చేసి రైతులకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా మా అనుమతి లేకుండా మా వ్యవసాయ భూమిలో ఉన్న వరి మరియు కూరగాయల పొలంలోకి వచ్చి రోడ్డు సంబంధించిన పనులు చేస్తున్నారు మేము పోయి అడిగితే మమ్మల్ని మా పొలంలో నుండి బయటకు గెంటివేశారు. మా పంట పొలాలు కు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా భూమి లాక్కుంటున్నారు. ఆవేదనతో రైతులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యం చేశారు పోలీసులు వచ్చి అడ్డుకున్నారు మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని లేకపోతే రైతులందరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు