మహిళా దొంగ అరెస్ట్
*100 గ్రాముల బంగారు ఆభరణాలు
*28వేల నగదు స్వాధీనం
*24 గంటల్లోనే నిందితురాలి అరెస్ట్ చేసిన పోలీసులు
-వివరాలు వెల్లడించిన డీసీపీ కరుణాకర్
పెద్దపల్లి,మార్చి26:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
పెద్దపల్లిలోని పైడబజార్‌లో ఒక బంగారు దుకాణంలో జరిగిన భారీ దొంగతనం కేసును పెద్దపల్లి పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితురాలిని అరెస్టు చేసి, దొంగిలించబడిన బంగారు ఆభరణాలు మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు.బుధవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ పి.కరుణాకర్ వివరాలను వెల్లడించారు.మార్చి 24న రాత్రి పైడబజార్‌లోని దేవరకొండ కరుణాకర్ అనే వ్యక్తికి చెందిన బంగారు దుకాణంలోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి రూ.2.5 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు ఆభరణాలు,రూ.40వేల నగదును దొంగిలించారని.దుకాణ యజమాని కరుణాకర్ ఫిర్యాదు మేరకు పెద్దపల్లి ఎసీపీ జి.కృష్ణ యాదవ్ నేతృత్వంలో సీసీ టీవీ ఫుటేజీలు,సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితురాలు లోకిని తిరుమల (38) అని గుర్తించామని,ఆమెను అరెస్టు చేసి 100 గ్రాముల బంగారు ఆభరణాలు,రూ.28 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.నిందితురాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకుందని డీసీపీ తెలిపారు.పెద్దపల్లిలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల సహాయంతో నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేయగలిగామని డీసీపీ తెలిపారు.ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పెద్దపల్లి సీఐ కె.ప్రవీణ్ కుమార్,
ఎస్సైలు జె.లక్ష్మణ్ రావు,బుద్దె మల్లేశం,ఏఎస్సై తిరుపతి,కానిస్టేబుళ్లు కె.ప్రభాకర్,ఎం.అనిల్ కుమార్,రాజు, రమేష్‌లను పెద్దపల్లి డీసీపీ పి.కరుణాకర్ అభినందించారు.
మహిళా దొంగ అరెస్ట్
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on