- *స్నేహితుడికి ఆర్థిక సాయం*
కాల్వ శ్రీరాంపూర్,మార్చి26:(ప్రజాకలం ప్రతినిధి) తమతో పదవ తరగతి చదువుకున్న స్నేహితుడు ఇటీవల రోడ్డు ప్రమాదనికి గురైన విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు బాసటగా నిలిచారు.మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 1999-2000 ఎస్ఎస్ సి విద్యార్థి బందెల రాజశేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.ఈ ప్రమాదంలో అతడు కుడి కాలు కోల్పోగా,స్పందించిన రాజశేఖర్ తోటి స్నేహితులు బుధవారం రూ.18వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటు మనో ధైర్యాన్ని కల్పించారు.శేఖర్ ను కలిసిన వారిలో జాలిగం రమేష్,పెద్దవేన రాజు,ఎండీ అహ్మద్ పాషా,తనుగుల నవీన్,నాగుల మల్యాల కిషన్,కోట లింగమూర్తి లు ఉన్నారు.
స్నేహితుడికి ఆర్థిక సాయం
Recent Comments
Hello world!
on