Thursday, April 10, 2025
Homeక్రైమ్విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లు

విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లు

విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆర్ ఆర్ న్యూస్ విలేకరి అరెస్ట్
బ్లాక్ మెయిల్ కు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం
బాధితులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. సమస్య ఏదైనా నేరుగా పోలీస్ ఆఫీసర్లను కలవాలి
మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి

మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 8 (ప్రజాకలం) (మహ్మద్ అజీమ్) విలేకరిగా చలామణి అవుతూ అమాయకుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, ప్రభుత్వ అధికారులపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్న గట్టేపల్లి రాజశేఖర్ అనే వ్యక్తిని మెట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి నిందితునికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాజశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా విలేకరిగా చెప్పుకుంటూ ‘ఆర్ ఆర్ న్యూస్’ పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడని తెలిపారు. ఇతర ఆదాయ మార్గాలు లేకపోవడంతో విలేకరి ముసుగులో అమాయక ప్రజలు, వ్యాపారులు, ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడన్నారని వెల్లడించారు.వివిధ సమస్యలతో ఉన్న అమాయక ప్రజలను గుర్తించి, తాను విలేకరినని, పోలీసులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి, వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసేవాడన్నారు. గతంలో ఇలా రెండు మూడుసార్లు మెట్‌పల్లి సీఐ వద్దకు కొందరిని తీసుకెళ్లి పైరవీ చేసి డబ్బులు సంపాదించాలని ప్రయత్నించాడన్నారు. అయితే సీఐ పైరవీలకు అవకాశం ఇవ్వకుండా బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించారన్నారు. దీంతో రాజశేఖర్ సీఐపై కోపం పెంచుకుని, వారి ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించాడన్నారు.ఈ క్రమంలో, ఫిబ్రవరి 12, 2025న రాజేశ్వరరావుపేటలో అక్రమ మొరం రవాణాను అడ్డుకోవడానికి వెళ్లిన ఇరిగేషన్ సబ్-డివిజన్ డీఈఈ లక్కంపల్లి అరుణోదయ్ కుమార్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకుని, బ్లాక్ మెయిల్ చేసి రూ. 1,50,000 వసూలు చేసినట్లు రాజశేఖర్ తెలుసుకున్నాడు. దీంతో రాజశేఖర్ కూడా అరుణోదయ్ కుమార్‌ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశాడన్నారు. మార్చి 5, 2025న ఎస్ఆర్ఎస్పీ క్యాంపులో అరుణోదయ్ కుమార్ ఉండగా, రాజశేఖర్ అతన్ని బెదిరించి రూ. 1,00,000 డిమాండ్ చేశాడన్నారు. లేకపోతే తన న్యూస్‌లో తప్పుడు కథనాలు ప్రచురిస్తానని, చంపేస్తానని బెదిరించాడన్నారు. భయపడిన అరుణోదయ్ కుమార్ తన వద్ద ఉన్న రూ. 5,000 రాజశేఖర్‌కు ఇచ్చి, మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పాడన్నారు.ఆ తర్వాత, రాజశేఖర్ ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని సీఐ మెట్‌పల్లి,పోలీసుల ప్రతిష్టను దెబ్బతీయాలని భావించి, సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశాడన్నారు.ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ’ అనే వాట్సాప్ గ్రూపులో ఓ రౌడీ షీటర్ ఇరిగేషన్ అధికారి నుండి అక్షరాల 1,50,000 తీసుకున్న రౌడీ షీటర్ స్థానిక సి.ఐ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోని సి.ఐ. ఆర్ఆర్ న్యూస్ తెలంగాణకు ఆశ్రయించిన ఇరిగేషన్ అధికారి. సి.ఐ. అని.. ఎవరికి అమ్ముడు పోయారు..?” అనే తప్పుడు కథనాన్ని ప్రచురించాడన్నారు. ఈ వార్తను చూపి అరుణోదయ్ కుమార్‌ను మళ్లీ బ్లాక్ మెయిల్ చేసి మిగతా డబ్బులు డిమాండ్ చేశాడన్నారు. ఇట్టి విషయం అయి అరుణోదయ్ కుమార్‌,డి ఈ ఈ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు రాజశేఖర్‌పై పి. కిరణ్ కుమార్, ఎస్ఐ కేసు నమోదు చేసి ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఏ.నిరంజన్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments