అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు
— ఆరుగురి అరెస్టు..ఐదు వాహనాలు స్వాధీనం
— ఎస్ఐ సులువ వెంకటేష్
కాల్వశ్రీరాంపూర్,మార్చి 31:(ప్రజాకలం ప్రతినిధి)కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరాత్ పల్లి శివారులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరుగురిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.వారి నుండి నాలుగు ట్రాక్టర్లు,ఒక జేసీబిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సులువ వెంకటేష్ తెలిపారు.ఎస్సై వెంకటేష్ వెల్లడించిన వివరాల ప్రకారం,మార్చి 30న రాత్రి 7:30 గంటల సమయంలో చిన్నరాత్ పల్లి శివారులో కొందరు వ్యక్తులు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ జంగ సంపత్ మరి కొంత మంది పొలీస్ సిబ్బంది కలిసి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిన్న సంపత్ ఆదివారం రాత్రి 7:45 గంటల సమయంలో చిన్నరాత్ పల్లి శివారుకు చేరుకున్నారు.అక్కడ అక్రమంగా ఇసుక తరళిస్తున్న నాలుగు ట్రాక్టర్లు,ఒక జేసీబీ ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకుసి విచారించగా వారు దుగ్యాల క్రాంతి కుమార్,దాసరి యుగేందర్,గుడాల రాజేష్,ఓడ్డి సదయ్య,దారంగుల రాజ్‌కుమార్,బత్తిని వెంకటేష్ లుగా గుర్తించామని వీరంతా చిన్నరాత్ పల్లి,కాల్వశ్రీరాంపూర్,ధర్మారం గ్రామాలకు చెందినవారని ఎస్సై పేర్కోన్నారు.హుస్సేన్‌మియా వాగు సమీపంలో జెసిబి సహాయంతో ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేసి,అధిక లాభాల కోసం అక్రమంగా తరలిస్తున్నట్లు వారు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.వారికి ఎటువంటి బిల్లులు,అనుమతులు లేవని తెలిపారు.నాలుగు ట్రాక్టర్లు,ఒక జేసీబిని స్వాధీనం చేసుకుని,ఆరుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.
అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on